ఈ 15 ఐటమ్స్ మన దగ్గర చాలా స్పెషల్…కానీ ఇతర దేశాల్లో బ్యాన్…ఎందుకో తెలుసా.?

ఈ 15 ఐటమ్స్ మన దగ్గర చాలా స్పెషల్…కానీ ఇతర దేశాల్లో బ్యాన్…ఎందుకో తెలుసా.?

by Mohana Priya

Ads

భారత దేశంలో చాలా వస్తువులు చాలా కారణాల వల్ల నిషేధించబడ్డాయి. అలాగే భారత దేశంలో వాడే కొన్ని ప్రాడక్ట్స్ కూడా ఇతర దేశాల్లో నిషేధించబడ్డాయి. ఆ ప్రాడక్ట్స్ ఏవో, అవి నిషేధించడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 కిండర్ సర్ ప్రైజ్

నాన్ నూట్రిటివ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయని, అలాగే తినే పదార్థం లో బొమ్మ పెట్టడం వల్ల చోకింగ్ హజార్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయని యు.ఎస్.లో దీనిని బ్యాన్ చేశారు.

#2 అన్ ప్యాస్చరైస్డ్ మిల్క్

ప్రమాదకరమైన మైక్రోబ్స్ ఇంకా జెర్మ్స్ ఉంటాయని యుఎస్, కెనడా లోని దాదాపు ఇరవై రెండు రాష్ట్రాల్లో అన్ ప్యాస్చరైస్డ్ మిల్క్ ని బ్యాన్ చేశారు.

#3 విక్స్ వేపరబ్

ఇందులో ఉండే పదార్థాల వల్ల ఆస్తమా, టీబి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని నార్త్ అమెరికాలో, అలాగే కొన్ని యూరోపియన్ దేశాల్లో దీనిని బ్యాన్ చేశారు. దీనిని టాక్సిక్ పదార్థంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది.

అలాగే విక్స్ యాక్షన్ 500 వాడితే కూడా చాలా ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కొన్ని ప్రదేశాల్లో బ్యాన్ చేశారు.

#4 జెల్లీ క్యాండీ

కొంజాక్ అనే థికెనింగ్ ఏజెంట్ తో ఇవి తయారవుతాయని అని, దానివల్ల పిల్లలకి చోకింగ్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని యుఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా వంటి ప్రదేశాల్లో వీటిని బ్యాన్ చేశారు.

#6 చూయింగ్ గమ్

పబ్లిక్ ప్లేసెస్ శుభ్రంగా ఉంచడానికి, మాస్ రాపిడ్ ట్రాన్సిట్ (MRT) సర్వీసెస్ లో ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి సింగపూర్ లో చూయింగ్ గమ్స్ బ్యాన్ చేశారు.

#7 లైఫ్ బాయ్ సోప్

చర్మానికి హాని కలుగుతుంది అని, మనుషులకి అలాగే జంతువులకి కూడా ఈ సబ్బు మంచిది కాదు అని కొన్ని ఫారిన్ కంట్రీస్ దీనిని బ్యాన్ చేశారు

#8 రెడ్ బుల్

రెడ్ బుల్ తాగితే గుండెకు సంబంధించిన సమస్యలు, డిప్రెషన్, హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని, 18 సంవత్సరాలకంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్ళు దీన్ని తాగకూడదు అని, డెన్మార్క్, ఫ్రాన్స్ ఇంకా లిథువేనియాలో రెడ్ బుల్ ని బ్యాన్ చేశారు.

#9 పెస్టిసైడ్స్

పెస్టిసైడ్స్ వాడిన (చల్లిన) పదార్థాలు తింటే ఆరోగ్యానికి మంచిది కాదని భారతదేశంలో వాడే 60కి పైగా పెస్టిసైడ్స్ వేరే దేశాల్లో నిషేధించబడ్డాయి.

#10 సమోసా

వెస్టర్న్ స్నాక్స్ లాగా ఉన్నాయి అని సోమాలియాలో ఒక టెర్రరిస్ట్ గ్రూపు సమోసాలని బ్యాన్ చేశారు.

#11 నానో

గ్లోబల్ ఎన్‌సిఎపి నిర్వహించిన ఇండిపెండెంట్ క్రాష్ టెస్ట్ లో నానో ఫెయిల్ అయ్యింది. దీంతో ఒకవేళ ఈ కారు ఉపయోగిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ఇతర దేశాల్లో నానో నిషేధించారు.

#12 డి కోల్డ్ టోటల్

కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని, డి కోల్డ్ టోటల్ ని బ్యాన్ చేశారు.

#13 మారుతి సుజుకి ఆల్టో 800

సేఫ్టీ స్టాండర్డ్స్ ఇంకా గైడ్ లైన్స్ అనుకున్నట్టుగా లేవు అని మారుతి సుజుకి ఆల్టో 800 ని కొన్ని ప్రదేశాల్లో బ్యాన్ చేశారు.

#14 డిస్ప్రిన్

గ్యాస్ట్రిక్ అల్సరేషన్, డిజి నెస్ (dizziness), హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్, దద్దుర్లు (రాషెస్) వచ్చే అవకాశాలు ఉన్నాయి అని దీన్ని బ్యాన్ చేశారు.

#15 నిములిడ్

లివర్ సంబంధిత సమస్యలు వస్తాయి అని, అలాగే ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ ఇంకా కొన్ని దేశాల్లో దీని వాడకాన్ని బ్యాన్ చేశారు.


End of Article

You may also like