Ads
ప్రస్తుత రోజుల్లో నిత్యవసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ప్రతి ఒక్క వస్తువుపై ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు నిత్యవసర సరుకులు కొనుగోలు చేయడానికి భయపడుతున్నారు. డీజిల్ పెట్రోల్ నుంచి కందిపప్పు మినప్పప్పు వరకు ప్రతి ఒక వస్తువుపై ధరలు అమాంతం పెరిగాయి. అయితే నానాటికి ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ధరలు మాత్రం తగ్గడం లేదు. ఒకప్పుడు వెయ్యి రూపాయలు పెడితే నిత్యవసర సరుకులు కొంతమేర అయినా వచ్చేవి.
Video Advertisement
కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రం వేలు ఖర్చు పెట్టినా కూడా కనీసం ఒక మోతాదులో కూడా రావడం లేదు. దీంతో సామాన్యులు నిత్యవసర ధరలు చూసి తలలు పట్టుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒకప్పటి నిత్యవసర సరుకుల ధరలకు సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే.. అప్పట్లో నిత్యవసర సరుకులు ధరలు ఈ విధంగా ఉన్నాయి. కందిపప్పు మూడు కేజీలు ఐదు రూపాయల 10 పైసలు, పెసరపప్పు రెండు కేజీలు మూడు రూపాయల 40 పైసలు, మినప్పప్పు రెండు కేజీలు మూడు రూపాయల అరవై పైసలు, శనగపప్పు ఒక కేజీ ఒక రూపాయి 25 పైసలు , ఆవాలు అర్థ కేజీ ఒక రూపాయి, జీలకర్ర కాల్ కేజీ ఒక రూపాయి 25 పైసలుగా ఉండేవి..
అలాగే మెంతులు కాల్ కేజీ 50 పైసలు, మిరపకాయలు అర్థ కేజీ రెండు రూపాయల 75 పైసలు, ఇంగువ డబ్బా 50 పైసలు, రెండు లైఫ్ బాయ్ సబ్బులు ఒక రూపాయి 40 పైసలు, మూడు కేజీల నూనె 13 రూపాయల 50 పైసలు, ఒక కేజీ పంచదార నాలుగు రూపాయలు, కాల్ కేజీ నెయ్యి రెండు రూపాయల 50 పైసలు ఈ విధంగా అప్పట్లో( 1971) లో నిత్యవసర సరుకులు ధరలు ఉండేవి. కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రం అన్ని వందల్లోనే ఉన్నాయి.
End of Article