బాహుబలి… తెలుగు సినిమాలలో ఓ మేజిక్ లాంటి సినిమా. పార్ట్ 1 , పార్ట్ 2 రెండు ఆద్యంతం ఉత్కంఠభరితం గా సాగుతాయి. ఎన్నిసార్లు ఈ సినిమా ను చూసినా ఎదో మేజిక్ ను చూసినట్లు.. ఒక వండర్ ని స్క్రీన్ పై చూసినట్లు అనిపిస్తూ ఉంటుంది. రాజమౌళి ఐదేళ్ల పాటు శిల్పాన్ని చెక్కినట్లు చెక్కి ఈ సినిమా రెండు పార్ట్ లను తెరపై ఆవిష్కరించారు.

Video Advertisement

 

హీరో ప్రభాస్ కూడా ఇతర సినిమాలేవీ చేయకుండా.. సమయం కేటాయించి ఎంతో కష్టపడి ఈ సినిమాను చేసారు. తెలుగు సినిమా స్థాయిని బాహుబలి సినిమా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమా తరువాత హీరో ప్రభాస్ కూడా ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు. ఆ తరువాత ప్రభాస్ చాలా జాగ్రత్తగా తన సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు.

bahubali 3

ఇక దేవసేన గా నటించిన అనుష్క గురించి ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. అందం, అభినయం తో ఆకట్టుకోవడం లో అనుష్క ట్రెండ్ సెట్ చేశారనే చెప్పాలి. ఈ సినిమా లో దేవసేన గా అనుష్క ను తప్ప మరెవరిని ఉహించుకోలేం. శివ గామి గా నటించిన రమ్యకృష్ణ అయినా.. కట్టప్ప అయినా, అవంతిక అయినా.. ఆయా పాత్రల్లో వారిని తప్ప ఇంకెవరిని చూడలేం అన్నంతగా ఈ సినిమాను దర్శకుడు జక్కన్న రూపొందించారు. అయితే.. ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో కూడా కొన్ని కొన్ని పొరపాట్లు జరిగాయి.

ఆ మిస్టేక్ లను మీరు ఈ కింద వీడియో లో చూసేయండి. ఇవి మూవీ చేసేటపుడు మనం గమనించకపోయినా.. ఆ తరువాత ఇవి గమనించినప్పుడు అరె ఇదేంటి..? అని అనిపిస్తూ ఉంటుంది. వీటి వలన కధకు వచ్చే నష్టం ఏమి ఉండదు.. కానీ కొన్ని కొన్ని సార్లు ఇలా జరుగుతూ ఉంటుంది అంతే.

ఇది కూడా చదవండి : తమిళ్ నుంచి తెలుగు లో డబ్ అయిన సినిమాలలో ది బెస్ట్ ఇవే