పరగడుపున ఖాళీ కడుపుతో వీటిని అస్సలు ముట్టుకోవొద్దు.

పరగడుపున ఖాళీ కడుపుతో వీటిని అస్సలు ముట్టుకోవొద్దు.

by Megha Varna

Ads

రుచికరమైన ఆహార పదార్థాలను చూస్తే నోరూరుతుంది. రుచిగా ఉంటే ఇక వెనుకాముందు చూస్కోకుండా లాగించేస్తుంటారు చాలామంది. కానీ అలా తినేయకూడదు. పరగడపున తాగే ఈ టీ, కాఫీ ల వల్ల వారి హర్మొన్లలో అసమతుల్యత ఏర్పడి…తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారట. కాఫీ, టీ లే కాదు….ఖాళీ కడపున తీసుకోకూడని కొన్ని పదార్థాల లిస్ట్ ఇక్కడ అందించాం…వీటిని  పరగడుపున తీసుకుంటే ఎటువంటి అనారోగ్యాలు వస్తాయో ఆ వివరాలు కూడా మీకోసం.

Video Advertisement

సోడా, కూల్ డ్రింక్స్:

ఖాళీ కడుపుతో…. PH విలువ ఎక్కువగా ఉండే సోడా, కూల్ డ్రింక్స్  ను తాగడం వల్ల పేగుల్లో ఇరిటేషన్ వచ్చి వాంతులు అయ్యే ప్రమాదం ఉంది.

టమాట:

పరగడుపున టమోట లు తినకూడదు…టమాటాల్లో ఉండే యాసిడ్స్ ఖాళీ కడుపులో చేరితే వికారం కలగడమే కాదు, పేగుల్లో మంట పుడుతుంది.

అరటిపండ్లు:

పరగడపున అరటిపండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో ఉంటే మెగ్రీషియం లెవల్స్ అమాంతం పెరుగుతాయి. ఇది ఆరోగ్యరిత్యా ప్రమాదకరం.

ఆల్కాహాల్:

ఖాళీ కడుపుతో ఆల్కాహాల్ తాగడంతో శరీరంలోని జీర్ణ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. పొట్ట నొప్పి…అధిక బరువు లాంటి సమస్యలు తలెత్తుతాయి.

స్పైసీ ఫుడ్స్ :

అల్సర్ రావడానికి ప్రధాన కారణం స్పైసీ ఫుడ్స్,  ఇక ఇవి  ఖాళీగా ఉన్న మన కడుపులో చేరితే అల్సర్ త్వరగా వచ్చే ప్రమాదం ఉంది.

జిమ్ కు వెళ్లే ముందు:

జిమ్ కు ఖాళీ కడుపున వెళ్లకూడదు…అలా వెళితే కండరాలు విపరీతంగా అలసిపోయి భరించలేని నొప్పులు వస్తాయి. అందుకే జిమ్ కు వెళ్లే ముందు అరటిపండును మినహాయించి ఇతర ఏ ప్రూట్స్ ను అయిన తినాలి.

 


End of Article

You may also like