Ads
పూర్వం వండే వంటలుకి ఇప్పుడు మనం వండే వంటలకు చాలా తేడా ఉంటుంది. పైగా ఇప్పుడు ఎక్కువగా మనం డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలను తింటున్నాం. అలానే కొత్త కొత్త ఆహార పదార్థాలను కూడా తింటున్నాం. కాలం మారే కొద్ది వంటల్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి.
Video Advertisement
అయితే మనం ఏదైనా ఆహార పదార్ధలను తినేటప్పుడు అందులో కొంచెం ఉప్పు లేదు కారం తగ్గినా కూడా మనకి అస్సలు రుచించదు. నిజానికి ఆ కూరని కానీ ఏదైనా ఆహార పదార్థాన్ని కానీ నోట్లో పెట్టుకో బుద్ధి వేయదు.
సాల్ట్ కనుక తక్కువైంది అంటే అన్నం లో అయినా కొంచెం సాల్ట్ కలుపుకుని తీసుకుంటూ ఉంటారు కొంత మంది. కానీ 500 ఏళ్ల క్రితం అసలు భారతదేశంలో కారమే వాడే వారు కాదు. దేవుడా కారం లేకపోతే అసలు వాళ్ళు ఎలా తినేవారు అని అనుకుంటున్నారా..? అప్పట్లో వాళ్ళు కారానికి బదులుగా మిరియాల పొడినే ఉపయోగించే వారు.
మిరియాల పొడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనిని కూడా మనం వంటల్లో వాడుతూ ఉంటాము. మిరియాల చారు వంటివి స్పెసిఫిక్ గా చేసుకు తింటూ ఉంటాం కూడా. నిజానికి మిరియాల పొడి వల్ల చాలా మేలు కలుగుతుంది. అల్సర్ వంటి సమస్యలు కూడా ఇది తరిమికొడుతుంది. 500 ఏళ్ల క్రితం కారం ఉండేది కాదు కనుక దానికి బదులుగా కేవలం మిరియాల పొడిని మాత్రమే ఉపయోగించేవారు.
దీనితో రుచి కూడా బాగుండేది. మిరియాల పొడిని ఉపయోగించడం వల్ల చాలా సమస్యలు తగ్గుతాయి. మతిమరుపు, అల్జీమర్ వంటి సమస్యలు ఉండవు. అలానే అలర్జీలు కూడా తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, వాపులు కూడా మిరియాలు తగ్గిస్తాయి. లివర్ డీటాక్సిఫికేషన్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. నిజానికి ఎండుకారం వలన సమస్యలే కానీ ప్రయోజనం లేదు. కనుక నచ్చితే అప్పటి పురాతన పద్ధతినే అనుసరించవచ్చు.
End of Article