Ads
తొమ్మిది మ్యాచుల్లో కేవలం ఒక్కటి మాత్రం నెగ్గి ఐపీఎల్ 2021 లో లీగ్ నుండి ఎలిమినేట్ అయిన మొదటి టీం సన్ రైజర్స్ హైదరాబాద్. మిగిలిన అన్ని మ్యాచ్ లు గెలిచినా ప్లే ఆఫ్స్ కి వెళ్ళలేరు. శనివారం రోజు పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో ఓడిపోయారు. స్వల్ప లక్షాన్ని కూడా ఛేదించలేకపోయారు. వార్నర్ కెప్టెన్సీ లో గతంలో కప్ విన్ అయిన ఈ టీం ఇప్పుడు ఇంత ఫెయిల్ అవ్వడంతో ఫాన్స్ అందరు నిరాశపడుతున్నారు. అసలు ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటో ఒకసారి ఆలోచిద్దాం.
Video Advertisement
#1. అసలు ఓటమికి గల కారణాల గురించి మాట్లాడుకుంటే…ఆక్షన్ గురించి ప్రస్తావించాల్సి వస్తుంది. ఆక్షన్ లో బాలన్స్ ఉండే లాంటి టీం ని సెలెక్ట్ చేసుకోలేకపోయారు హైదరాబాద్ మానేజ్మెంట్.
#2. ఫారిన్ ప్లేయర్స్ లో ప్లేయింగ్ 11 లో ఏ నలుగురిని ఎంచుకోవాలి అనే విషయంలో కొంత విఫలం అయ్యారు. జానీ బైర్ స్టో మిస్ అవ్వడంతో చాలా పెద్ద లాస్ కనిపించింది టీం. అతను ఉండి ఉంటె పవర్ ప్లే లో మంచి స్కోర్ వచ్చేది.
#3. వార్నర్, విల్లియంసన్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడలేకపోయారు.
#4. మనీష్ పాండే, కేదార్ జాదవ్, విజయ్ శంకర్ మిడిల్ ఆర్డర్ లో మంచి స్టాండ్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. దీంతో మంచి స్కోర్ నిలపలేకపోయారు హైదరాబాద్ జట్టు.
#5. టీం లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఇండియా ప్లేయర్ ని తీసుకోకపోవడంతో ప్రెషర్ అంతా వార్నర్, విల్లియంసన్ మీదే పడుతూ వచ్చింది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ లో మంచి ప్లేయర్ లేకపోవడం పెద్ద మైనస్.
#6. భువనేశ్వర్ కుమార్ కూడా ఈ సీజన్లో అంతా ఆకట్టుకోలేకపోయాడు. గత సీజన్ లలో హైదరాబాద్ జట్టు అనగానే అందరికి బౌలింగ్ గుర్తొచ్చేది. కానీ ఈసారి బౌలింగ్ లో కూడా ఈ జట్టు విఫలమైంది. నటరాజన్ దూరం అవ్వడం పెద్ద మైనస్ అయ్యింది. ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, సిద్ధార్త్ కౌల్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయారు.
నెక్స్ట్ సీజన్లో అయినా ఈ జట్టు మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వగలరేమో ఆశించాలి. ఈ సీజన్ లో ప్లేఆఫ్ కి వెళ్లాలంటే ఏదైనా మ్యాజిక్స్ జరగాల్సిందే.
End of Article