Ads
భార్య భర్తల బంధం పెళ్లితో మొదలైతే.. బావా మరదళ్ల బంధం పుట్టగానే మొదలవుతుంది అంటుంటారు. పుట్టగానే మొదలైన బంధాన్ని.. పెళ్లి తో జీవితాంతం కొనసాగించే బావా మరదళ్ళు చాలా మందే ఉంటారు. అలా.. సెలెబ్రెటీల్లో కూడా చాలా మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది సీనియర్ హీరోలే ఉన్నారు. ఆ లిస్ట్ పై ఓ లుక్ వేద్దాం..
Video Advertisement
1. కృష్ణ-ఇందిరా:
సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లోకి రాకముందే తన మరదలు ఇందిరా దేవిని 1961 లో వివాహం చేసుకున్నారు. పెళ్ళైన దాదాపు నాలుగేళ్ల తరువాత కృష్ణ తొలి సినిమా విడుదలైంది.
2. ఎన్టీఆర్-బసవతారకం:
సీనియర్ ఎన్టీఆర్ కూడా తన సొంత మరదలు బసవతారకాన్ని 1942 లోనే వివాహం చేసుకున్నారు. ఎన్టీఆర్ కు కూడా సినిమాల్లోకి రాకముందే వివాహమైంది.
3. మోహన్ బాబు- విద్యా దేవి & నిర్మలా దేవి:
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన సొంత మరదలు విద్యా దేవినే వివాహం చేసుకున్నారు. ఆమె అకస్మాత్తుగా మరణించడం తో.. ఆమె సోదరి నిర్మలా దేవిని వివాహం చేసుకున్నారు.
4. ఏఎన్నార్-అన్నపూర్ణ:
అక్కినేని నాగేశ్వర్రావు కూడా తన సొంత మరదలైన అన్నపూర్ణను 1949లో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఏఎన్నార్ వి పది సినిమాలు విడుదలయ్యి.. ఆయన రొమాంటిక్ హీరో గా పేరు తెచ్చుకున్నారు.
5. కార్తీ-రజిని:
తమిళ్ హీరో కార్తీ కి తెలుగు నాట కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. కార్తీ కూడా 2011 లో తన సొంత మరదలు రజిని ని పెళ్లి చేసుకున్నారు.
6. ఆది- అరుణ:
సాయికుమార్ నట వారసుడు ఆది సినిమాల్లోకి రాకముందు అండర్ 19 క్రికెట్ ను ఆడాడు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక.. తన మేనమామ కుమార్తె అరుణను 2014 లో పెళ్లి చేసుకున్నారు.
End of Article