ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. తప్పక ఈ 7 తీసుకోండి..!

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. తప్పక ఈ 7 తీసుకోండి..!

by Mounika Singaluri

Ads

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటిస్తున్నారు ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. శ్వాస వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం. శ్వాస వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలతో ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి వీటిని కనుక మీరు తీసుకుంటే ఊపిస్థితిలో ఆరోగ్యంగా ఉంటాయి.

Video Advertisement

మరి ఊపిరితిత్తులు ఏ విధంగా ఆరోగ్యంగా మార్చుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

#1. క్యాప్సికం:

క్యాప్సికం ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఆరోగ్యంగా ఉంచుతుంది ఇందులో విటమిన్ సి ఉంటుంది వివిధ రకాల సమస్యలని రాకుండా దూరం చేస్తుంది.

#2. ఆపిల్:

ఆపిల్ కూడా ఆరోగ్యానికి మంచిదే. యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి ఆపిల్ తీసుకుంటే ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి.

#3. ఆకుకూరలు:

ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఆకుకూరలు కూడా ఎంతో మేలు చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే ఆకుకూరలు ని కూడా రెగ్యులర్ గా డైట్ లో చేర్చండి.

#4. బీన్స్:

ఫైబర్ అధికంగా ఇందులో ఉంటుంది వివిధ రకాల సమస్యల్ని దూరం చేస్తాయి బీన్స్. ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంచేందుకు బీన్స్ సహాయపడతాయి.

#5. బెర్రీస్:

ఇవి కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఊపిరితిత్తుల్లో శ్లేష్మం, వాపుని ఇవి తొలగించుతాయి. సో వీటిని కూడా రెగ్యులర్ గా డైట్ లో చేర్చండి.

#6. టమాట:

టమాటాలో విటమిన్ సి ఉంటుంది అలానే లైకోపీన్ ఎక్కువ ఉంటుంది ఊపిరితిత్తులని ఆరోగ్యంగా ఉంచుతాయి టమాటాలు. సిఓపిడి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి కాబట్టి మీరు డైట్ లో టమాటాలని కూడా తీసుకుంటూ ఉండడం మంచిది.

#7. గుమ్మడికాయ:

గుమ్మడికాయలో కెరటానోయిడ్స్ ఎక్కువ ఉంటాయి ఊపిరితిత్తులు బాగా పని చేసేందుకు ఇవి సహాయ పడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా వీటిలో అధికంగా ఉంటాయి. దానితో పాటు యాంటీ ఇంఫ్లమేషన్ గుణాలు కూడా ఇందులో అధికంగా ఉంటాయి కాబట్టి గుమ్మడికాయని కూడా డైట్ లో చేర్చుకోవడం మంచిది. దానితో ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.


End of Article

You may also like