డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి దాకా RC15 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ షూట్ జరుపుకుంటోంది. ఈ సినిమాకి ‘గేమ్ చేంజర్’ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు సొంత బ్యానర్ లో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Video Advertisement
ఈరోజు (మార్చి 27) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా పేరును రీవిల్ చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు. ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పేరుగాంచిన దర్శకుడు శంకర్ ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ కు కోసం ప్రొడ్యూసర్ దిల్ రాజుతో భారీగానే ఖర్చు పెట్టించాడంట. ఈ టైటిల్ గ్లింప్స్ కోసం 70 లక్షల రూపాయలు ఖర్చు అయినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ కోసం శంకర్ నెల రోజుల పనిచేశాడని తెలుస్తోంది.
ఇక దీని కోసం శంకర్ 11 వెర్షన్లు సిద్ధం చేయించాడని సమాచారం. చివరగా వాటిలో ఒకటి ఖరారు చేసి నేడు విడుదల చేశారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి కూడా డైరెక్టర్ శంకర్ భారీగానే ఖర్చు పెట్టించాడు. పాన్ ఇండియా మూవీ కావడంతో ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రానికి 200 కోట్ల బడ్జెట్ అనుకుంటే దర్శకుడు శంకర్ ఇప్పటిదాకా దాదాపు 280 కోట్లు ఖర్చు పెట్టించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి వరకు డెబ్బై శాతం మాత్రమే అయ్యింది.
ఆగస్టు వరకు ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యే ఛాన్స్ ఉంది. ఇక అప్పటి వరకు ఈ మూవీ బడ్జెట్ ఎంత అవుతుందో చూడాలి మరి. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. కియార అద్వానీ, అంజలి కథానాయకలుగా నటిస్తున్నారు. ఈ మూవీలో శ్రీకాంత్, జయరామ్, రాజీవ్ కనకాల కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ తరువాత చరణ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read: “రామ్ చరణ్ పోస్టర్ అని చెప్పి యష్ ఫోటో రిలీజ్ చేశారు ఏంటి..?” అంటూ… రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” ఫస్ట్‌లుక్ పోస్టర్‌పై 15 మీమ్స్..!