90’స్ సిరీస్ లో నటించిన వాసంతిక… సలార్ సినిమాలో ఉందా..? ఎక్కడో గుర్తుపట్టారా..?

90’స్ సిరీస్ లో నటించిన వాసంతిక… సలార్ సినిమాలో ఉందా..? ఎక్కడో గుర్తుపట్టారా..?

by Harika

సినిమాలకు ఎంత డిమాండ్ ఉందో ఇప్పుడు వెబ్ సిరీస్ కి కూడా అంతే డిమాండ్ ఉంది. తెలుగులో కూడా వెబ్ సిరీస్ హవా గట్టిగా నడుస్తోంది. గతంలో కంటే ఇప్పుడు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వెబ్ సిరీస్ వస్తున్నాయి.

Video Advertisement

పెద్ద హీరోలు, పెద్ద హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఇటీవల హీరో శివాజీ నటించిన సిరీస్ 90 స్ (నైంటీస్) విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈటీవీ విన్ యాప్ లో ఇది స్ట్రీమ్ అవుతోంది. దీనికి సెకండ్ సీజన్ కూడా ఉంది అని చివరిలో ప్రకటించారు.

90 s a middle class biopic streaming date

టీచర్ గా పని చేసే ఒక వ్యక్తి, అతని భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు, వారి జీవితం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ సిరీస్ సాగుతుంది. ఎంతో మంది ఈ సిరీస్ కి రిలేట్ అయ్యారు. తమ జీవితాలను చూసుకున్నట్టు ఉంది అంటూ చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. అంత సహజంగా ఈ సిరీస్ తీశారు. ఈ సిరీస్ లో శివాజీ కూతురు పాత్రలో నటించింది వాసంతిక.

90 s series vasanthika in salaar movie

వాసంతిక ఈ సిరీస్ లో దివ్య పాత్రలో నటించింది. వాసంతిక చైల్డ్ ఆర్టిస్ట్. అంతకుముందు నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటించింది. అయితే వాసంతిక సలార్ సినిమాలో కూడా ఉంది. కానీ గెటప్ కొంచెం డిఫరెంట్ గా ఉండడం వల్ల గుర్తుపట్టడం కష్టం అవుతుంది.

90 s series vasanthika in salaar movie

ఇప్పుడు సలార్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. సినిమా సమయంలో వాసంతికని గుర్తుపట్టలేని వాళ్ళు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చాక తాను ఎక్కడ ఉందో గుర్తుపట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కాటేరమ్మ ఫైట్ సీన్ కి ముందు కనిపించే అమ్మాయిల్లో ఒక అమ్మాయిగా వాసంతిక నటించింది. వాసంతిక సలార్ సినిమాలో కనిపించేది కొంచెం సేపే అయినా కూడా, సిరీస్ రిలీజ్ అయ్యాక తన పాపులారిటీ పెరగడంతో వాసంతికని ఇప్పుడు అందరూ గుర్తు పడుతున్నారు.

ALSO READ : 10 రోజుల నుండి ఓటీటీలో ట్రెండ్ అవుతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ సినిమా…ఫ్రీగా చూసేయ్యోచ్చు.!


You may also like

Leave a Comment