10 రోజుల నుండి ఓటీటీలో ట్రెండ్ అవుతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ సినిమా…ఫ్రీగా చూసేయ్యోచ్చు.!

10 రోజుల నుండి ఓటీటీలో ట్రెండ్ అవుతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ సినిమా…ఫ్రీగా చూసేయ్యోచ్చు.!

by Harika

ఇప్పుడు ఓటిటి సంస్థలు ఆడియన్స్ కి మంచి కంటెంట్ అందిస్తున్నాయి. ప్రతివారం క్రైమ్ జోనర్, థ్రిల్లర్ జోనర్,కామెడీ జోనర్ అంటూ ఇలా రకరకాల జోనర్లు సినిమాలు తీసుకువచ్చి ఫుల్ టైంపాస్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఒకవైపు ధియేటర్లలో సంక్రాంతి సినిమాలు సందడి చేస్తుంటే, ఓటిటి లో కూడా కొత్త సినిమాలు వచ్చి మంచి వ్యూస్ సాధిస్తున్నాయి.

Video Advertisement

తాజాగా బిగ్ బాస్ ఓటిటి సీజన్ లో నటించిన కంటెస్టెంట్ అజయ్ నటించిన అజయ్ గాడు సినిమా జీ 5 ఓటిటి లోకి వచ్చింది. ఈ సినిమాని అజయ్ శ్రీ దర్శకత్వంలో హీరోగా నటించి రూపొందించాడు. ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయాలనుకున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల డైరెక్ట్ ఓటిటి లో విడుదల చేశారు. ఈ సినిమాని ప్రేక్షకులు ఫ్రీగానే చూసేయవచ్చు. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి కూడా మంచి టాక్ తెచ్చుకుని మంచి వ్యూస్ సాధిస్తూ వస్తుంది.

అయితే ఈ సినిమా కథ విషయానికి వస్తే…మధ్యతరగతి కుర్రాడు అజయ్ ప్రపంచం, డబ్బు, పేరు, ప్రేమ గురించి తెలుసుకోవడానికి ఇబ్బందిపడుతుంటాడు.అదే సమయంలో డ్ర-గ్స్ కి బానిస అయిన మెడికో శ్వేత ప్రేమలో పడిపోతాడు. ఆమెను సరైన మార్గంలోకి తీసుకురావడానికి అతడు ఎలా ప్రయత్నించాడు అనేది సినిమా. ప్రస్తుతం ఈ చిత్రానికి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. మంచి టైం పాస్ కోసం ఈ చిత్రాన్ని ఒకసారి చూడండి.


You may also like

Leave a Comment