మద్యం తాగేముందు చీర్స్ ఎందుకు కొడతారో తెలుసా..?

మద్యం తాగేముందు చీర్స్ ఎందుకు కొడతారో తెలుసా..?

by Megha Varna

Ads

ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది మద్యానికి అలవాటు పడిపోతున్నారు. పైగా చదువుకున్నవాళ్ళు కూడా పార్టీలు వంటివి ఎక్కువగా జరగడం వల్ల మద్యం ఎక్కువగా తీసుకుంటున్నారు. మద్యానికి బానిస అవ్వడం వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. జీవితాన్ని కూడా అది నట్టేట్లో ముంచేస్తుంది.

Video Advertisement

మద్యం తాగడం వల్ల ఆరోగ్యమే కాదు.. ప్రశాంతత ఉండదు. అలానే కుటుంబం కూడా నాశనం అయిపోతుంది. నష్టాలు ఇన్ని ఉన్నాయని తెలిసినా చాలా మంది దీని నుండి బయట పడలేక పోతున్నారు.

ఇది ఇలా ఉంటే మద్యం తాగేటప్పుడు ప్రతి ఒక్కరూ చీర్స్ అని చెప్పుకుని మద్యం తాగుతారు. ముఖ్యంగా బర్త్డే పార్టీలు వంటివి జరిగినప్పుడు మనం ఇలాంటివి చూస్తూ ఉంటాం. అయితే అసలు ఈ చీర్స్ అనే పదం అలవాటు ఎలా అయ్యింది..? అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

మందు తాగడానికి ముందు చీర్స్ అని చెప్పుకుని తాగుతూ ఉంటారు. ఎందుకు ఈ పదాన్ని వాడతారు అని ఎప్పుడైనా ఊహించారా..?, చీర్స్ అనే పదానికి అర్థం ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. పూర్వకాలంలో దొంగలు దొంగతనం చేశాక ఒక దగ్గర కూర్చుని దొంగలించిన వాటిని లెక్క పెట్టుకుని ఎంతో సంతోషంగా పార్టీ చేసుకునేవారట.

ఆ గుంపులో కూడా ఒకరంటే ఒకరికి పడని వాళ్ళు ఉండేవారట. అటువంటి వాళ్ళని చంపేయాలని అనుకుని ఈ మద్యం గ్లాసులో విషం కలుపుతారు. అందరూ మద్యంని గ్లాసులో పోసుకున్నాక తరువాత తాగడానికి ముందు చీర్స్ అని చెప్పేవారట. అయితే ఒకసారి అందరూ ఇలా గ్లాసులు కొట్టుకోవడం వల్ల ఒకరి గ్లాసులో మద్యం మరొకరి గ్లాసులో పడుతూ ఉంటుంది. ఒకవేళ విషం ఉన్నా సరే అందరికి వెళుతుంది అందుకనే ఇలా చీర్స్ అనేది వచ్చింది. ఇప్పటికి కూడా దానిని అంతా ఫాలో అవుతున్నారు.


End of Article

You may also like