Ads
కేరళ అనగానే మనకి గుర్తొచ్చేది ఓనమ్ పండుగ మరియు ఆ చీరకట్టు. కేరళలో ఉండే మహిళలు ఎక్కువగా తెలుపు మరియు గోల్డ్ కలర్ చీరని వేసుకుంటారు. ఎప్పుడైనా ఎందుకు వాళ్లు ఆ రంగు చీరని వేసుకుంటారు అని ఆలోచించారా..?, అయితే అదే రంగునే ఎందుకు ఉపయోగించాలి అని అనిపించిందా..? అయితే దీని కోసం ఇక్కడ క్లియర్ గా ఉంది మరి తెలుసుకోవాలంటే ఓ లుక్ వేసేద్దాం.
Video Advertisement
సిల్క్ లేదా కాటన్ తో తయారు చేసిన తెలుపు మరియు బంగారం రంగు కాంబినేషన్ తో కేరళ మహిళలు అందంగా తయారవుతారు. నిజంగా ఆ చీర కడితే ఏ మహిళైనా ఎంతో రాయల్ గా కనపడతారు. చూడడానికి ఓ అందమైన రాణి లాగ కనపడతారు. కేరళ చీరలో వేసుకునే తెలుపు, గోల్డ్ చీర వాళ్ళ యొక్క సంప్రదాయానికి చిహ్నం.
పూర్వకాలంలో బౌద్ధులు దీనిని మన్దమ్ నెరియత్తం అని అనేవారు. మన్దమ్ అంటే చీరలో కింద భాగం. అలానే నెరియత్తం అంటే పైన వేసుకుని చీరలో భాగం. అలానే బౌద్ధులు మరియు జైన్ లిటరేచర్ లో దీనిని సాత్థికా అని రాశారు. ఇక ఆ రంగులనే ప్రత్యేకంగా ఎందుకు వాడతారు అనేది విషయంలోకి వెళితే..
కేరళలో వేడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రాక్టికల్ గా చూసుకుంటే లైట్ కలర్ దుస్తులు వేసుకుంటే మంచిది. ముదురు రంగులు వేసుకోవడం వల్ల ఎండ వేడి పట్టేస్తుంది. దీంతో మరింత వేడిగా మనకి ఉంటుంది. అందుకనే తెలుపు రంగుని వాడారు. పైగా దానికి తోడు తెలుపు రంగు చాలా అందంగా ఉంటుంది. ఇక బంగారం రంగు గురించి చూస్తే తెలుపు మరియు బంగారం కలిసి ఉండటం నిజంగా చాలా మంచిది. ఇది శుభప్రదం. కేరళలో ఓనమ్ పండుగ జరిగినప్పుడు తప్పకుండా మగువలు ఈ చీరలు కట్టుకుని అందంగా ముస్తాబవుతారు. పైగా ఇవి విష్ణుమూర్తి యొక్క రంగులు కూడా.
End of Article