Ads
ఈ మధ్యకాలంలో డయాబెటిస్ సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. ఆరోగ్యం విషయంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Video Advertisement
లేదంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. డయాబెటిస్ పేషెంట్లు సాధారణంగా చేసే తప్పులు గురించి ఇప్పుడు మనం చూద్దాం.
#1. చాలా మంది పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వెళ్లి మందులు వద్దు అని చెప్తూ ఉంటారు. కేవలం డైట్ మరియు వ్యాయామంతో షుగర్ ని తగ్గించుకుందాం అని అంటూ ఉంటారు. అయితే ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత కేవలం ఈ రెండింటితో షుగర్ కంట్రోల్ అవ్వదు.
#2. షుగర్ మందులు వల్ల కిడ్నీ చెడిపోతుంది కదా అని చాలామంది పేషెంట్లు అంటూ ఉంటారు. అలానే షుగర్ మాత్రలు వల్ల లివర్ చెడిపోతుంది అని అంటారు. కానీ ఈ సమస్యలేమీ రావు.
#3. ఇన్సులిన్ ఇచ్చేటప్పుడు కొంతమంది అప్పుడేనా ఇంకా ఇన్సులిన్ వాడను. ఇంకా లైఫ్ ఉంది అని అంటూ ఉంటారు. అయితే అలా అనడం సరైనది కాదు. ఎందుకంటే షుగర్ మాత్రలు పనిచేయనప్పుడు ఇన్సులిన్ ఇస్తారు.
#4. డాక్టర్ దగ్గరికి ఒకసారి వెళ్ళాం కదా మళ్ళీ రెండేళ్ల తర్వాత వరకు వెళ్లక్కర్లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ రెగ్యులర్ గా డాక్టర్ ని సంప్రదిస్తూ ఉండాలి.
#5. అలానే టెస్టింగ్ రోజు మాత్రలు వేసుకోకుండా కూడా డాక్టర్ దగ్గరకి వెళ్ళకూడదు. చాలామంది డాక్టర్ ని ట్యాబ్లేట్స్ వేసుకోకుండా సంప్రదిస్తారు. కాబట్టి ఆ తప్పు చేయొద్దు ఎందుకంటే రిపోర్టు సరిగ్గా రాదు.
#6. కొంతమంది సామలు, కొర్రలు వంటివి తినడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అని అనుకుంటారు కానీ అన్నం మానేసి ఇలా తినడం వల్ల షుగర్ లెవెల్స్ లో ఏమీ తేడా రాదు. అందుకనే డాక్టర్ ఏం చెబుతున్నారంటే తీసుకునే ఆహారం ఏది అనేది కంటే కూడా ఎంత అనేది ముఖ్యం.
#7. షుగర్ అంటే తీపి కనుక కాకరకాయ వంటి పదార్ధాలు తింటాను. అప్పుడు షుగర్ సమస్య తగ్గుతుంది అని కొంత మంది అనుకుంటూ ఉంటారు. కానీ కాకరకాయ జ్యూస్ కానీ మెంతులు పొడి కానీ వేపాకు జ్యూస్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల షుగర్ తగ్గదు.
#8. కాబట్టి షుగర్ పేషెంట్లు డయాబెటిస్ సమస్య నుండి బయట పడడానికి తక్కువ తినడం, తక్కువ తక్కువ ఎక్కువ సార్లు తినడం, ఫ్రూట్స్ వంటివి ఎక్కువ డైట్లో తీసుకోవడం లాంటివి చేయాలి.
Watch Video:
End of Article