Ads
నిద్రపోయేటప్పుడు ఎడమవైపు తిరిగి నిద్రపోతే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. నిద్ర వల్ల శరీరానికి ఎప్పుడు కూడా కొత్త శక్తి వస్తుంది. పునరుత్తేజం పొందడానికి నిద్ర ఉపయోగపడుతుంది. మానసిక ఉల్లాసం కూడా మనకి కలుగుతుంది. అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా నిద్రపోతారు.
Video Advertisement
కొందరు ఎడమవైపుకి తిరిగి నిద్రపోతే మరి కొందరు కుడివైపుకి, కొందరు బోర్లా పడుకోవడం అలవాటు. అయితే ఎడమ వైపు తిరిగి నిద్రపోతే చాలా మంచిది. అయితే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనేది చూస్తే… ఎడమ వైపుకి తిరిగి నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. కుడి వైపుకి తిరిగి నిద్రపోతే నెగెటివ్ ప్రభావం మన మీద పడుతుంది. ఎడమ వైపు తిరిగి నిద్రపోతే గుండె పై భాగంలో ఉండే లింఫ్ నోడ్ల వ్యవస్థ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి అవుతుంది.
దీంతో లింఫ్ నోడ్ల వ్యవస్థ దాని పని అది చూసుకుంటుంది. అదే విధంగా ఎడమ వైపుకి తిరిగి నిద్రపోవడం వల్ల శరీరంలో వ్యర్థ పదార్థాలు కూడా బయటకు వెళ్తాయి. ఎడమ తిరిగి నిద్రపోవడం వల్ల శరీరంలో ఉండే లింఫ్ వ్యవస్థలో ప్లీహం ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. కనుక ఎడమ వైపుకి తిరిగి నిద్రపోవడం మంచిది. అలా అలవాటు లేకపోతే అలవాటు చేసుకోవడం మంచిది.
End of Article