Ads
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ చాలా మంది ధూమపానానికి బాగా అలవాటు పడి.. ఆ అలవాటును మానుకోలేకపోతుంటారు. అయితే నిజం చెప్పాలంటే ధూమపానం ఒకసారి అలవాటు అయిందంటే దాని నుండి బయట పడటం చాలా కష్టం. ఒకవేళ కనుక స్మోకింగ్ అలవాటు వుంది.. ఆ అలవాటు కనుక మానేస్తే శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది.
Video Advertisement
సిగరెట్ లో నికోటిన్ ఉంటుంది. అలాగే ఇతర హానికరమైన పదార్థాలు కూడా ఉంటాయి. సిగరెట్ అలవాటు వుంది.. దానిని మానేస్తే శరీరంలో కార్బన్ మోనాక్సైడ్, నికోటిన్ తగ్గే అవకాశం ఉంటుంది. అలానే సిగరెట్ తాగడం మానేసిన పన్నెండు గంటలకి కార్బన్ మోనాక్సైడ్ స్థాయి నార్మల్ లెవెల్ కి చేరుకుంటుంది.
ఎక్కువగా సిగరెట్లు తాగే వాళ్ళకి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సిగరెట్ కనుక మానేస్తే మానేసిన రెండు రోజులకి బాగా అలసటగా అనిపించడం, తల తిరగడం, విశ్రాంతి లేకపోవడం లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అదే విధంగా సిగరెట్ మానేసిన వాళ్ళల్లో తీవ్రమైన తలనొప్పి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
కానీ తిరిగి సాధారణ స్థితికి మళ్ళీ వచ్చేచ్చు. సిగరెట్ మానేసిన కొన్ని నెలలకి ఊపిరితిత్తులు బలంగా మారతాయి. అలానే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. సిగరెట్ మానేసిన వాళ్లు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది. అలానే గుండె జబ్బులు మొదలైన అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. సిగరెట్ మానేసిన వాళ్ళు చూయింగ్ గుమ్ ని తింటే సిగరెట్లని తాగాలని కోరిక తగ్గుతుంది.
End of Article