Ads
ఈ మధ్యకాలంలో గుండెపోట్లు ఎక్కువగా వస్తున్నాయి. అయితే మంచి ఆహారం తీసుకోవడం, సరైన జీవన విధానాన్ని పాటించడం చేస్తే అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు.
Video Advertisement
ఇది వరకు అయితే అధిక వయసు ఉన్న వాళ్లకి గుండెపోటు ఎక్కువగా వచ్చేది. కానీ ఇప్పుడు యుక్తవయసు వాళ్ళకి కూడా గుండెపోటు సమస్య ఎక్కువ అయ్యింది. చాలా మందికి బాత్రూంలోనే గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. ఎందుకు బాత్రూంలో గుండెపోట్లు వస్తున్నాయి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అమెరికా ఏజెన్సీ ఎన్సిబిఐ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 11 శాతం గుండెపోటు మరణాలు బాత్రూంలో జరుగుతున్నాయని తెలుస్తోంది. స్నానం చేసే సమయంలో స్నానం చేసేటప్పుడు తల స్నానం కూడా చేస్తూ ఉండటం వల్ల వేడి రక్తం గల శరీరం ఒక్కసారిగా చల్లటి ఉష్ణోగ్రతతో బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది. దీని వల్ల గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అన్ని విధాలుగా తల భాగం వైపు రక్తప్రసరణ పెరుగుతుందని రక్తనాళాలలో ఏవైనా అడ్డంకులు ఉంటే గుండెపోటు వస్తుందని అంటున్నారు.
స్నానం చేసేటప్పుడు ముందుగా పాదాలను కడుక్కుని ఆ తర్వాత పై వైపు వెళ్లకుండా ఉంటేనే మంచిది. రక్తపోటు అధిక కొలెస్ట్రాల్ మైగ్రేన్ తో బాధపడే వాళ్ళు ఇలా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మలబద్దకం సమస్య ఉన్నవాళ్లకి అయితే విసర్జన సమయంలో బాత్రూంలో ఇబ్బందులు వస్తాయని దీనితో గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు నిపుణులు. కాబట్టి మలబద్ధకం సమస్యతో బాధపడే వాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
మరీ ముఖ్యంగా శీతాకాలంలో ఎక్కువగా గుండెపోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శీతాకాలంలో రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఇరుకైన రక్తనాళాల గుండా రక్తం వెళ్లకుండా ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల రక్తపోటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. తీవ్రమైన చలి సమయంలో రక్తం మందంగా, జిగటగా మారుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది.
ఇది రక్తం గడ్డ కట్టడాన్ని సులభం చేస్తుంది. ఎక్కువ స్ట్రోక్స్ అనేవి రక్తం గడ్డ కట్టడం వల్ల వస్తాయి. ప్రతిరోజు 40 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, 20 నిమిషాల పాటు సూర్యకాంతిలో ఉండటం ఇలాంటి ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యరశ్మి కారణంగా శరీరంలో యాంటీబాడీలను ఎక్కువగా తయారవుతాయి. దీని వల్ల వాపు అధిక రక్తపోటు తగ్గుతుంది. గుండెపోటుకు దూరంగా ఉండాలంటే చలికాలంలో ప్రతిరోజు కూడా 40 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే మంచిది.
End of Article