Ads
శరీరమంతా బూడిదతో చూడడానికి చాలా వింతగా ఉంటారు అఘోరాలు. ఆడవాళ్ళల్లా జుట్టుని పెంచుకునే.. పుర్రెలని పట్టుకుని ఎంతో భయంకరంగా ఉంటారు. అయితే అఘోరాల జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి జీవన విధానాన్ని అనుసరిస్తారు, అసలు ఎక్కడ ఉంటారు ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Video Advertisement
ఎక్కువగా మనకి అఘోరాలు కనపడవు. కుంభమేళాలు, పుష్కరాలు వంటివి జరిగినప్పుడు అఘోరాలని మనం చూడొచ్చు. మిగిలిన సమయాల్లో వాళ్లు ఎక్కడ ఉంటారు అనేది చూస్తే… మానవుల సంచారం లేని నిశబ్దకరమైన ప్రాంతాలలో వాళ్ళు ఉంటారు. ఎక్కువ ధ్యానం చేసుకుంటూ ఉంటారు.
రాత్రివేళల్లో స్మశానంలో క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు. వీళ్లు నరమాంసాన్ని ఇష్టపడతారు. శవాలని ప్రేమిస్తారు. అఘోరాల చేతులలో పుర్రె ఉంటుంది. అయితే ఇది మగవారి పుర్రె. ఎందుకంటే వీళ్ళు అస్సలు ఆడవాళ్ళ పుర్రెని ముట్టుకోరు.
స్మశానంలో వీళ్ళు ఒక మగవారి పుర్రెని తీసుకుని పుర్రెను పైభాగం నుంచి కోసేసి దానిని ఒక చిన్న పాత్ర మాదిరి తయారు చేస్తారు. దానిలో వాళ్ళు ఆహారం వేసుకుని తింటారు. యాచించేటప్పుడు కూడా ఈ పుర్రెను వాడతారు. నీటిని మాత్రం కమండలంలో వేసుకుని తాగుతారు. ఇలా చేస్తే వాళ్లకి శక్తులు ఉంటాయి అని వారి నమ్మకం.
కుంభమేళా సమయంలో అఘోరాలు వేల సంఖ్యలో వస్తారు. వాళ్లు వచ్చేటప్పుడు కానీ వెళ్లేటప్పుడు కానీ ఎవరికీ కనిపించరు. కనిపించినా కొద్ది దూరం మాత్రమే కనపడి ఆ తర్వాత మాయమైపోతారు. అయితే వాళ్లు ఎవరికి ఎందుకు కనిపించరు…?, కనిపించిన వెంటనే ఎందుకు మాయమైపోతారు…? దీని గురించి చూస్తే… అఘోరాలు నానో టెక్నాలజీని వాడతారు. సూక్ష్మ శరీర యానాన్ని ఉపయోగించి ఎవరికీ కనిపించకుండా హిమాలయాల నుండి ఎక్కడికైనా వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళి పోతూ ఉంటారు.
పూర్వకాలంలోనే వీళ్ళు ఈ టెక్నాలజీ గురించి తెలుసుకున్నారని.. హిమాలయాల్లో తపస్సు చేసి ఇలాంటి శక్తులని పొందొచ్చని కొందరు భావిస్తున్నారు. నాగ సాధువులుకి చాలా మహిమలు తెలుసు. వీళ్ళు కొంతకాలం పాటు ఆహారం, నీళ్లు లేకుండా కూడా బతకగలరు. ఎప్పుడూ కూడా వీళ్ళు దైవ ధ్యానంలో ఉంటారు. నాగ సాధువులు గాల్లోనే ఏదైనా బూడిదని కానీ తాయత్తుని కానీ తీసి భక్తులకు ఇస్తారు.
ఇలా గాలిలో నుండి ఏదైనా వస్తువులు తీయడం అనేది మామూలు విషయం కాదు. దీన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రం అని అంటారు. ఎప్పుడూ హిమాలయాల్లో ఉండే నాగసాధువులు, అఘోరాలు వంటి వాళ్ళు ఇలాంటివి చేస్తారు. అయితే అద్భుత శక్తులు ఉన్నాయి అనడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు. వాళ్ళు కేవలం చెప్పుకోవడం వల్లే మనకి తెలుస్తుంది. ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరూ లేరు. పైగా హిమాలయాల్లో అన్నేళ్ల పాటు ఉండడం అనేది సాధారణ విషయం కాదు. సాధ్యమైనది కాదు. కానీ అఘోరాలు మాత్రం బయట ప్రపంచానికి సంబంధం లేకుండా జీవిస్తున్నారు.
End of Article