1950 లో “colgate” సేల్స్ పెరగడానికి ఓ యువకుడి ఐడియా ఇది…లక్ష డాలర్లకు కొన్న కంపెనీ!!

1950 లో “colgate” సేల్స్ పెరగడానికి ఓ యువకుడి ఐడియా ఇది…లక్ష డాలర్లకు కొన్న కంపెనీ!!

by Mohana Priya

Ads

మామూలుగా విజయానికి ఐదు మెట్లు అని అంటారు. దాంట్లో ఒక మెట్టు ఏంటో తెలుసా? కామన్ సెన్స్. ఒక్కొక్కసారి రీసెర్చ్ చేసి, అవసరమైన దానికంటే ఎక్కువగా అన్ని కోణాల్లో నుండి ఆలోచించి, ప్లాన్ వేసి ఎంతో కష్టపడి తయారుచేసిన ఒక ఆలోచన కంటే మామూలుగా ఆలోచించి చేసే పని వల్ల ఎన్నో ఊహించని గొప్ప ఫలితాల్ని పొందే అవకాశాలు ఉంటాయి.

Video Advertisement

అలాంటిదే ఇప్పుడు మీరు చదవబోయే కథ. కోల్గేట్ పేస్ట్ తెలియనివారెవరైనా ఉంటారా? కోల్గేట్ మొదలయింది 1805 లో. కోల్గేట్ సంస్థ తన మొదటి బ్రాంచ్ ను ప్రారంభించిన దేశం న్యూ యార్క్ సిటీ.

తర్వాత వేరే దేశాల్లో కూడా ఎంతో పాపులర్ అయింది. యుఎస్ మార్కెట్లో లాంచ్ అయిన మొదటి దంత సంరక్షణ సంస్థ కోల్గేట్. అలా దాదాపు 50 సంవత్సరాల వరకు ఏ పోటీ లేకుండా మొదటి స్థానంలో ఉండేది కోల్గేట్. తర్వాత యూనిలీవర్ ప్రారంభించిన పెప్సోడెంట్ లాంటి కొత్త బ్రాండ్ల కారణంగా కోల్గేట్ కి మెల్ల మెల్లగా మార్కెట్ విలువ తగ్గడం మొదలైంది.

తాము ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నాము. కాబట్టి ఎవరూ తమని ఏమీ చేయలేరు అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండేది కోల్గేట్ సంస్థ. కానీ కొద్ది రోజులకే ప్రతి చోటా ఊహించని స్థాయిలో విమర్శలు రావడం మొదలైంది. అప్పుడు కోల్గేట్ సంస్థ ఏం చేయాలో తెలీక సేల్స్ పెంచడానికి ఉపాయాలని వెతకటం మొదలుపెట్టింది. బోర్డ్ మెంబర్స్ అందరితో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఏం చేయాలో ఎవరికీ అర్థం కావట్లేదు. ఏ ఒక్కరికీ సరైన ఐడియా రావట్లేదు. ఆ మీటింగ్ లోకి ఒక తక్కువ గ్రేడ్ ఉద్యోగి వచ్చాడు.

ఆ ఉద్యోగి అక్కడి వాళ్ళతో తన దగ్గర ఒక ఉపాయం ఉంది అని చెప్పాడు. దానికి వాళ్ళు సరే అని చెప్పమన్నారు. అప్పుడు అతను పేస్ట్ బయటికి వచ్చే హోల్ సైజు కొన్ని మిల్లీమీటర్లు పెంచితే సేల్స్ పెరిగే అవకాశం ఉంది అని చెప్పాడు.

ఎందుకంటే ఒకవేళ పేస్ట్ వచ్చే హోల్ సైజు పెద్దగా ఉంటే బ్రష్ మీద పేస్ట్ ఎక్కువగా పడుతుంది. దాంతో పేస్టు తొందరగా అయిపోతుంది. అప్పుడు జనాలు వెంటనే మళ్లీ పేస్టుని కొనుక్కుంటారు. అలా ఎక్కువసార్లు కొనడం వల్ల సేల్స్ పెరుగుతాయి అని చెప్పాడు.

ఆ ఐడియా విన్న బోర్డు మెంబర్లు అందరూ అతన్ని చూసి నవ్వారు. అంతేకాకుండా అతను చెప్పిన ఆలోచన చాలా తెలివి తక్కువగా ఉంది అని వెటకారం చేశారు. తర్వాత ఎన్నో ఐడియాలు అమలు చేశారు కానీ ఒక్కటి కూడా మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో కంపెనీ ఆర్థిక పరిస్థితి ఇంకా కిందకి వెళ్ళిపోయింది.

అప్పుడు సడన్ గా అందరికీ అతను చెప్పిన ఉపాయం గుర్తొచ్చింది. ఎలాగూ పరిస్థితి అస్సలు బాగాలేదు కాబట్టి ఈ ఐడియా వర్కౌట్ అయినా కాకపోయినా పెద్దగా తేడా లేదు అని అనుకున్నారు. దాంతో ఆ ఉద్యోగి ని పిలిచి తను చెప్పిన ఐడియాని ఇప్పుడు అమలు చేస్తున్నట్టు అతనికి చెప్పారు.

అతను చెప్పినట్టే పేస్ట్ బయటికి వచ్చే హోల్ ని కొంచెం పెంచారు. దీంతో మెల్లగా మార్కెట్లో కోల్గేట్ అమ్మకాలు మళ్లీ పెరగడం మొదలయ్యాయి. ఆర్థిక పరిస్థితి మెల్లగా కోలుకుంది. దాంతో మళ్ళీ కోల్గేట్ తన మునుపటి స్థానానికి వచ్చేసింది. ఈ ఐడియా ఇచ్చినందుకు ఆ ఉద్యోగి ని సత్కరించడమే కాకుండా కంపెనీని తిరిగి మళ్లీ ఎంతో పెద్ద స్థాయికి తీసుకు వచ్చినందుకు అతని పేరుని ఎన్నో బిజినెస్ పుస్తకాల్లో ప్రచురించారు.

ఇంత చిన్న ఐడియా కోల్గేట్ యొక్క దశనే మార్చేసింది. అందుకే కొన్నిసార్లు కష్టపడి ఆలోచించడం కంటే తెలివిగా ఆలోచించడం అనేది ముఖ్యం. ఇంకా మీ తెలివిని ప్రదర్శించడానికి మీరు ఏ స్థాయిలో ఉన్నారు అనేది అస్సలు ముఖ్యం కాదు. ఒక అడుగు ముందుకేసి మీరనుకుంటున్నది ధైర్యంగా చెప్పడంవల్ల మీ సలహా తీసుకున్న వాళ్ళే కాకుండా మీరు కూడా ఎంతో గొప్ప స్థాయికి చేరుకుంటారు.


End of Article

You may also like