చంటిపిల్లల విషయంలో తల్లులు తప్పక ఈ జాగ్రత్తలు తీసుకోవాలి…!

చంటిపిల్లల విషయంలో తల్లులు తప్పక ఈ జాగ్రత్తలు తీసుకోవాలి…!

by Megha Varna

Ads

చాలామంది ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి చాలా సమయాన్ని కేటాయిస్తారు. ఎందుకంటే మన పరిసరాలు బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. అలాంటిది పసి పిల్లలు ఉన్న ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఇల్లును ఏ విధంగా ఉంచుకోవాలి..? అనేది చాలా ముఖ్యం.

Video Advertisement

#1. తల్లులు ఎంతో శుభ్రతను పాటించాలి:

పసిపిల్లలు తల్లితోనే ఎక్కువ సమయం గడుపుతారు. కాబట్టి రోజుకు రెండు సార్లు వాళ్ళ బట్టలు మార్చుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పాలు ఇచ్చే తల్లి బట్టల విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి.

#2. తల్లులకు గోళ్లు వుండకూడదు:

పసి పిల్లల తల్లులకు గోర్లు ఉండడం వల్ల పిల్లలకు జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తరచుగా గోళ్లను కట్ చేసుకుంటూ ఉండాలి మరియు నెయిల్ పాలిష్ ను అస్సలు ఉపయోగించకూడదు. అంతేకాదు జుట్టు విరబోసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే అది కనుక పిల్లల నోట్లో పెట్టుకుంటే ఇబ్బందులు వస్తాయి.

#3. పసిపిల్లల బట్టలను ఇలా ఉతకండి:

ఈ మధ్య ఎక్కువగా ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే అవి అసలు ఉపయోగించకూడదు. కేవలం వేడినీళ్ళతో బట్టలను ఉతకడమే మంచిది. కావాలనుకుంటే కొన్ని చుక్కల డెటాల్ ను మాత్రమే వేడి నీటిలో కలిపి బట్టలను ఉతకవచ్చు. తరచుగా హ్యాండ్ గ్లౌజ్, సాక్స్ వంటి వాటిని ఉతుకుతూ ఉండాలి.

#4. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి:

ప్రతి రోజు దుమ్ము కనిపించకుండా తుడుచుకోవాలి. ముఖ్యంగా పసిపిల్లలు ఉండే ఇళ్లలో రెండు రోజులకు ఒకసారైనా తడిగుడ్డ పెట్టాలి. అలా అని ఎక్కువగా ఫ్లోర్ క్లీనర్ ను ఉపయోగించకూడదు. తడిగుడ్డ పెట్టేటప్పుడు ఆ నీటిలో కొంచెం ఉప్పు వేసి పెడితే మన పరిసరాలలో ఉండే నెగిటివిటీ తగ్గుతుంది.

#5. ప్లాస్టిక్ ను ఎక్కువగా ఉపయోగించవద్దు:

చాలా వరకు మన చుట్టు ప్లాస్టిక్ కవర్లు, డెకరేషన్ కు సంబంధించిన సామాన్లు వంటివి ఉంటాయి. అయితే వాటివల్ల హానికరమైన టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి మరియు పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి వీలైనంత వరకు ప్లాస్టిక్ కు దూరంగా ఉండండి.

#6. తల్లులు తప్పకుండా ఈ దుస్తులను ధరించండి:

పసిపిల్లలను ఎత్తుకున్నప్పుడు వారికి బట్టలు వల్ల ఇబ్బంది కలగకుండా ఉండేటట్లు చూసుకోండి. వీలైనంతవరకు మెత్తటి దుస్తులను ధరించండి. పిల్లలకు కంఫర్టబుల్ గా లేకపోతే ఏడుస్తారు. కాబట్టి బట్టలు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి


End of Article

You may also like