Ads
ఆచార్య చాణక్యుడు మౌర్య వంశాన్ని స్థాపించారు. నంద వంశాన్ని నాశనం చేసి సింహాసనంపై సాధారణ పౌరుడిని రాజుని చేశారు. తన జీవితంలో చాణక్యుడు ఎన్నో కష్టాలను అనుభవించారు. చాణక్యుడి చాణిక్య నీతి నేటికీ చాలా ప్రజాదరణ పొందింది.
Video Advertisement
ఈ కాలంలో కూడా దానిని నేర్చుకోవచ్చు. ఆచార్య చాణక్యుడు మూడు విషయాల గురించి చెప్పారు. అయితే ఈ పనులు లో ఏ పనిలో కూడా సిగ్గుపడకూడదని అన్నారు. ఒకవేళ సిగ్గు పడితే ఆ వ్యక్తి జీవితంలో గొప్ప నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.
పూర్తిగా భోజనం చేయడానికి సిగ్గు పడకూడదు:
మామూలుగా ప్రతి ఒక్కరు కూడా ఆహారాన్ని నిండుగా తినాలని అనుకుంటారు. కానీ కొంతమంది మాత్రం బంధువులు లేదా స్నేహితుల ఇంటికి వెళ్ళినప్పుడు సగం సగం మాత్రమే తింటూ ఉంటారు. తినడానికి చాలా సిగ్గు పడుతూ ఉంటారు. కానీ కడుపు నిండా తినడం లో సిగ్గు పడకూడదని ఆచార్య చాణిక్యుడు చెప్పారు.
అప్పు ఇచ్చిన డబ్బులు అడగడానికి సిగ్గుపడకూడదు:
చాలామంది ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇస్తారు. తిరిగి మళ్లీ దానిని అడగడానికి సిగ్గుపడతారు అయితే ఇది చాలా తప్పు అని చాణక్యుడు చెప్పారు.
గురువు నుండి జ్ఞానాన్ని పొందడానికి ఆలోచించొద్దు:
గురువు నుండి జ్ఞానాన్ని తీసుకోవడానికి ఎప్పుడు సిగ్గు పడకూడదు. ఎప్పుడూ గురువు నుండి జ్ఞానాన్ని తీసుకోవడానికి ఆసక్తిగా ఉండాలి.
End of Article