Ads
సాధారణంగా ఇళ్ళల్లో పూజలు, వ్రతాలూ లాంటివి ఏవైనా జరిగినా లేదు అంటే దేవాలయాలకు వెళ్ళినప్పుడు మగవారు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటారు. కొందరు తమ గురువులకు కూడా సాష్టాంగ నమస్కారం చేస్తారు. అసలు సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి..? ‘స అష్టాంగం’ అంటే ఎనిమిది అవయవాలతో చేసే నమస్కారం.
Video Advertisement
చాలా మందికి ఈ సందేహం ఉంటుంది మగవారు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలా…?, స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు అని. మరి ఆ సందేహం గురించి ఇప్పుడు చూద్దాం. సాష్టాంగ నమస్కారంని సాధారణంగా చేసేటప్పుడు వక్షస్థలం, నుదురు, చేతులు, కాళ్ళు, కళ్ళు నేలకి ఆంచి అప్పుడు నమస్కారం చేయాలి.
అయితే స్త్రీ ఉదరం గర్భాశయాన్ని కలిగి ఉంటుంది. అందుకని సాష్టాంగ నమస్కారం చేస్తే ఒత్తిడికి గురవుతుంది. దాని కారణంగా గర్భస్రావాలు మొదలైన ఇబ్బందులు జరిగే ప్రమాదం ఉంటుంది. ఈ కారణంగా స్త్రీలను సాష్టాంగ నమస్కారం చేయవద్దు అని చెప్పడం జరుగుతుంది.
స్త్రీలు మోకాళ్లపై ఉండి నమస్కారం చేయొచ్చు. లేదు అంటే నడుము వంచి నమస్కారం చేయొచ్చు. పంచాంగ నమస్కారం స్త్రీలు చేయొచ్చు. పంచాంగ నమస్కారం అంటే కాళ్ళు, చేతులు మాత్రమే నేలకు తాకేలా ఉంచి నమస్కారం చేయాలి.
End of Article