Ads
మన శరీరంలో ముఖ్యమైన భాగాల్లో కిడ్నీలు ఒకటి. మన శరీరంలో రక్తాన్ని కిడ్నీలు ప్యూరిఫై చేస్తాయి. అందులో ఉండే వ్యర్థపదార్థాలను అవి బయటకు పంపించేస్తాయి. శరీరంలో ఉండే పదార్థాలు మూత్రం రూపంలో ఎప్పటికప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటాయి.
Video Advertisement
దీంతో మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఒకవేళ కనుక కిడ్నీ ఫెయిల్ అయితే ఈ ప్రక్రియ సరిగా జరగదు. దీనితో వ్యర్థ పదార్ధాలు పేరుకుపోతాయి. తద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే కిడ్నీలు పాడయ్యాయని ఎలా తెలుస్తుంది…?, ఎటువంటి లక్షణాలు బట్టి మనం తెలుసుకోవచ్చు అనేది చూద్దాం.
#1. కిడ్నీలు పాడైపోయి ఉన్నవాళ్లలో మూత్రం తక్కువగా వస్తుంది. హఠాత్తుగా మూత్రం యొక్క పరిమాణం తగ్గిపోవడం జరిగితే కిడ్నీ సమస్యలు ఉన్నట్లు తెలుసుకోవచ్చు.
#2. అదే విధంగా కిడ్నీలు ఫెయిల్ అయితే వికారం సమస్య ఎక్కువగా వస్తుంది. వాంతులు అయ్యేటట్టు అనిపించడం, వాంతులు అవ్వడం లాంటివి జరుగుతాయి.
#3. పాదాల్లో నీరు చేరుకోవడం, మడమలు, కాళ్ళు ప్రాంతంలో నీళ్ళు చేరడం, వాపులు రావడం లాంటివి జరిగితే కూడా కిడ్నీ ఫెయిల్ అయింది అని తెలుసుకోవచ్చు.
#4. అలానే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్లలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటుంది. తీవ్రమైన మత్తుగా, మగతగా అనిపించినా కూడా కిడ్నీల చెడిపోయాయని గ్రహించవచ్చు.
#5. ఒత్తిడి, ఆందోళన, కంగారు ఇలాంటివి కలిగినప్పుడు కూడా మనం కిడ్నీ ఫెయిల్ అయిందని తెలుసుకోవచ్చు.
కిడ్నీ ఫెయిల్ అయితే ఛాతిలో నొప్పిగా ఉంటుంది. కొందరిలో ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కొందరైతే కిడ్నీ చెడిపోతే కోమాలోకి వెళ్తారు.
#6. కిడ్నీ చెడిపోతే మూత్రం రంగులో మార్పు వస్తుంది. మూత్రం గులాబీ రంగు లేదా ఎరుపు రంగులో ఉంటుంది. ఒక వేళ మూత్రంలో నురగ వచ్చినా సరే కిడ్నీలు చెడిపోయాయని తెలుసుకోవచ్చు.
End of Article