Home Filmy Adda బాలయ్య కంటే ముందే అఘోర పాత్రలలో నటించిన టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా..? ఓ లుక్ వేయండి.

బాలయ్య కంటే ముందే అఘోర పాత్రలలో నటించిన టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా..? ఓ లుక్ వేయండి.

by Anudeep

బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ మూవీ పై బాగానే ఎలివేషన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో బాలయ్య లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. బాలయ్య లీడ్ రోల్ చేస్తున్న ఏ సినిమా అయినా వన్ మాన్ షో అయిపోతుంది.

సినిమాకి ముఖ్య హైలెట్ మాత్రం బాలకృష్ణ. రెండు పాత్రల్లో, అది కూడా ముఖ్యంగా అఖండ పాత్రల్లో బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అఘోరాగా ఆయన తన పాత్రకి వంద శాతం న్యాయం చేసారు. అయితే.. ఈ సినిమా కంటే ముందే టాలీవుడ్ హీరోలు అఘోర పాత్రలను పోషించారని తెలుసా..?

aghora

#1 చిరంజీవి

రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అర్జున్, సౌందర్య హీరో హీరోయిన్లుగా శ్రీ మంజునాథ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి శివుడి పాత్రను పోషించారు. ఓ సన్నివేశంలో మెగాస్టార్ అఘోరాగా కూడా కనిపిస్తారు. ఈ సినిమా కూడా మంచి విజయమే సాధించింది.

actors who played the roles of aghora

#2 నాగార్జున

నాగార్జున కూడా ఓ సినిమాలో అఘోరాగా కనిపిస్తారు. ఢమరుఖం సినిమాలో ప్రకాష్ రాజ్ శివుడిగా కనిపించగా.. నాగార్జున అఘోరాగా కనిపిస్తారు.

aghora 2

#3 వెంకటేష్

చంద్రముఖి సినిమా సీక్వెల్ గా వచ్చిన “నాగవల్లి” సినిమాలో వెంకటేష్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా వెంకటేష్ అఘోరా గా కనిపిస్తారు. అయితే చంద్రముఖి సినిమాకి వచ్చినంత రెస్పాన్స్ ఈ సినిమాకి రాలేదు.

actors who played the roles of aghora

#4 నాగబాబు

మెగాబ్రదర్ నాగబాబు కూడా “అఘోర” సినిమాలో ఫుల్ లెంగ్త్ అఘోర గా కనిపించారు. అయితే.. ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు.

actors who played the roles of aghora

#5 ఆర్య

తమిళ హీరో ఆర్య సినిమా కూడా “నేనే దేవుడ్ని” గా తెలుగులో డబ్ అయింది. ఈ సినిమాలో కూడా ఆర్య అఘోరగా కనిపించారు.

aghora 5

 

#5 సోనూసూద్

అలాగే అరుంధతి సినిమాలో “పశుపతి” గా సోనూసూద్ కూడా అఘోరాగా నటించారు. ఈ సినిమాలో పశుపతి పాత్రకి విశేషమైన ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.

aghora 4

 

#6 బాలకృష్ణ

ఇటీవల విడుదలైన అఖండలో బాలకృష్ణ అఘోరా గా నటించారు.

akhanda

అయితే ఆ సినిమాలు రిలీజ్ అయినప్పుడు.. ఈ పాత్రలు అంతగా హైలైట్ కాలేదు. కానీ అఖండలో మాత్రం.. అఘోరాగా బాలకృష్ణ పాత్ర విశేషంగా ఆకట్టుకుంటోంది.

You may also like