Ads
ప్రస్తుతం మార్కెట్లలో లభించే బీరువాలలో అద్దంతో ఉన్న బీరువాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే కొనుగోలుదారులు కూడా ఒక వస్తువు వల్ల రెండు ఉపయోగాలు ఉంటాయని వాటినే ఇష్టపడుతున్నారు. మరి ఇటువంటి బీరువాలు ఉండడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతాయి అని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.
Video Advertisement
అసలు బీరువాకి ఉండే అద్దానికి మరియు మనం ఎదుర్కొన్న ఇబ్బందులకు ఏమైనా సంబంధం ఉందా..?, నిజంగా దాని కారణంగా సమస్యలు వస్తాయా..? ఈ విషయాలని మనం చూద్దాం. సాధారణంగా లక్ష్మీదేవి ఉండే చోటు చాలా శుభ్రంగా ఉండాలి అని వింటూ ఉంటాం.
అయితే మనం బీరువాలో డబ్బులు, బంగారం వంటివి దాచుకుంటాం. లక్ష్మీదేవి మన బీరువాలో కొలువై ఉన్నట్టు. కాబట్టి బీరువాను ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటిది బీరువాకు అద్దం ఉన్నప్పుడు దాని ముందు నిలబడి తయారవడం సహజమే. మరి అమ్మవారి ముందు ఈ విధంగా చేయడం సరైనది కాదు, దాంతో లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్లి పోతుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. అందువల్ల బీరువాకు అద్దం ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
End of Article