Ads
పకోడీ, ఫ్రై, కూర ఇలా ఎన్నో రకాల వంటకాల్ని క్యాబేజీ తో మనం తయారు చేసుకోవచ్చు. అలానే సలాడ్స్ వంటి వాటిలో కూడా క్యాబేజీని మనం వేసుకోవచ్చు. అయితే క్యాబేజీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఏర్పడడానికి సహాయం చేయదు క్యాబేజీ.
Video Advertisement
యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే క్యాబేజీలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటాయి. అలానే ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పైగా క్యాబేజీను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందొచ్చు.
ముఖ్యంగా శీతాకాలంలో దీనిని తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. కడుపు సమస్యలు తగ్గించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఫైబర్ కూడా ఇందులో అధికంగా ఉంటుంది. అమినో యాసిడ్స్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. అలానే దీనిలో బీటా కెరోటిన్ ఉండడం వల్ల కంటి లోపల మచ్చల క్షీణత నివారణకు సహాయపడుతుంది.
రక్త పోటు సమస్య తో బాధపడేవారికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. అయితే ఇలా ఎన్ని ప్రయోజనాలు ఇచ్చే క్యాబేజీ తీసుకోవడం వల్ల కొంత హాని కూడా కలుగుతుంది. అయితే మరి క్యాబేజీ తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది చూద్దాం.
#1. శస్త్ర చికిత్స చేయించుకున్న వాళ్లు క్యాబేజీని అస్సలు తీసుకోకూడదు. తీసుకుంటే గ్లూకోజ్ స్థాయిలని ప్రభావితం చేస్తుంది. అందుకనే శస్త్రచికిత్స చేయించుకున్న రెండు వారాల వరకూ క్యాబేజీకి దూరంగా ఉండాలి.
#2. డయాబెటిస్ తో బాధపడే వాళ్లు క్యాబేజీ ను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం చూపిస్తుంది. దీని కారణంగా డయాబెటిక్ పేషెంట్లు మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. షుగర్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
#3. అలానే ఎలర్జీలు ఉన్నవాళ్లు క్యాబేజీని అస్సలు తీసుకోకూడదు. క్యాబేజీని ఎలర్జీలు ఉన్న వాళ్ల తీసుకుంటే మరింత ప్రమాదకరం అని గ్రహించండి.
#4. హైపో థైరాయిడిజం ఉన్న వ్యక్తులు కూడా క్యాబేజీని తీసుకోకూడదు. దీని కారణంగా ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
End of Article