Ads
ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ కూడా చాలామందిలో పెరిగింది. వంటింట్లో తరచూ వీటిని ఉపయోగిస్తే ఆరోగ్యంగా వుండచ్చని.. అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మరి ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు చూద్దాం. వీటిని ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు రాకుండా దూరంగా ఉండొచ్చు.
Video Advertisement
#1. పుదీనా:
పుదీనా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. విటమిన్ సి, డి, ఈ, బి, క్యాల్షియం, ఫాస్ఫరస్ వంటి పదార్ధాలు ఇందులో ఉంటాయి. ఇమ్యూనిటీని కూడా ఇది పెంచుతుంది. నిద్రలేమితో బాధపడే వాళ్ళు పుదీనా ఆకుల్ని ఒక గ్లాసు నీళ్లలో వేసి అరగంట తర్వాత తాగితే నిద్ర బాగా పడుతుంది. అలానే మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
#2. కొత్తిమీర:
కొత్తిమీర కూడా ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది. మహిళల రుతుచక్రం సమంగా సాగేలా చూసుకుంటుంది. కడుపునొప్పి, ఉబ్బసం వంటి వాటిని కూడా బయటపడొచ్చు. నోటి దుర్వాసన, నోటి పూత, దంతాలు పుచ్చిపోవడం ఇలాంటి సమస్యలను కూడా బయటపడొచ్చు.
#3. తులసి:
తులసి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేద గుణాలు ఉన్న తులసిని ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వంటి సమస్యలు ఉండవు.గుండె పనితీరు కూడా బాగుంటుంది.
#4. కరివేపాకు:
కరివేపాకు మనకి సులభంగా దొరుకుతుంది పైగా వంటల్లో ఎక్కువ వాడచ్చు. కరివేపాకుతో జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ని కూడా కరిగిస్తుంది.
End of Article