చేతులు నీటిలో నానితే ఇలా ముడతలు ఎందుకు వస్తాయో తెలుసా..? దీని వెనుక ఇంత కారణం ఉందా..?

చేతులు నీటిలో నానితే ఇలా ముడతలు ఎందుకు వస్తాయో తెలుసా..? దీని వెనుక ఇంత కారణం ఉందా..?

by Megha Varna

Ads

స్నానం చేసిన తర్వాత లేదా ఎక్కువ సేపు చేతులు నీళ్లలో నానినా లేదు అంటే సముద్రంలో ఎక్కువసేపు ఆడినా ఒళ్ళు అంతా కూడా సాధారణంగానే ఉంటుంది. కానీ వేళ్ళ దగ్గర మాత్రం చాలా మార్పు వస్తుంది. వయసు అయిపోయిన మాదిరి గీతలు లాగ వేళ్ళ మీద పడతాయి.

Video Advertisement

చూడడానికి అవి ముడతలు లాగ ఉంటాయి. అలానే కాళ్ళ వేళ్ళల్లో కూడా ఈ మార్పు కనిపిస్తుంది. అయితే ఇవి టెంపరరీగా వచ్చి మళ్లీ పోతాయి. వీటి వల్ల ఏ హానీ ఉండదు. అయితే అలా గీతలు ఎందుకు చేతి మీద వచ్చేస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. నీళ్లు తగిలాయి అంటే వేళ్ళ మీద ముడతలు మాదిరి గీతలు వచ్చేస్తూ ఉంటాయి. అయితే అన్ని శరీరభాగాల్లో ఇలా జరగదు.

కేవలం చేతులు, చేతి వేళ్ళు, కాళీ వేళ్ళ భాగంలో మాత్రమే ఇలాంటివి మనం గమనించవచ్చు. అయితే ఇలా అయిపోవడానికి కారణం ఆస్మోసిస్ అని తెలుస్తోంది. ఎక్కువ సేపు నీళ్లల్లో చేతిలను ఉంచినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఇది డెడ్ స్కిన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది.

అదే విధంగా కొంచెం నీళ్లను చెయ్య పీల్చుకోవడం జరుగుతుంది. అయితే ఎక్కువ సేపు నీళ్ళలో గడిపినప్పుడు డెడ్ స్కిన్ సెల్స్ నీళ్లని అబ్సర్బ్ చేసుకుంటాయి. దీంతో చర్మం ఉబ్బుతుంది. కానీ బయట ఉండే లివింగ్ స్కిన్ మాత్రం టైట్ గా ఎటాచ్ అయ్యి ఉంటుంది. కాబట్టి పెరిగిన ఉపరితల వైశాల్యంని భర్తీ చేయడానికి మన చర్మం ముడతలు పడుతుంది.


End of Article

You may also like