Ads
పెరుగు తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. పెరుగు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే కానీ ఈ అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు తీసుకుంటే అంతే సంగతులు. అయితే మరి పెరుగు ఎవరు తీసుకోకూడదు అనేది ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1. ఆస్తమా లేదా శ్వాస సంబంధిత సమస్యలు:
శీతాకాలంలో పెరుగు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆస్తమా లేదా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్లు పెరుగు కి దూరంగా ఉండాలి. ముఖ్యంగా చలి కాలంలో దూరంగా ఉండటం మంచిది.
#2. ఆర్థరైటిస్ సమస్య:
ఆర్థరైటిస్ సమస్యతో బాధపడే వాళ్ళు పెరుగుకి దూరంగా ఉండాలి. ఒకవేళ కనుక పెరుగు తిన్నారు అంటే ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
#3. ఎసిడిటీ సమస్య:
బాగా జీర్ణం అవ్వడానికి పెరుగు బాగా సహాయం చేస్తుంది కానీ ఎసిడిటీ సమస్య ఉన్నవాళ్లు పెరుగు తీసుకోకూడదు. ఒక వేళ తింటే అజీర్తి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో అస్సలు తీసుకోకూడదు. అలానే లాక్టోజ్ ఇంటోలరెన్స్ సమస్య ఉన్నవాళ్లు తీసుకుంటే అతిసారం లేదా కడుపు నొప్పి సమస్య వస్తుంది.
End of Article