వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రపోయేటప్పుడు తల దగ్గర ఈ 4 వస్తువులని అస్సలు పెట్టుకోకూడదట.!

వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రపోయేటప్పుడు తల దగ్గర ఈ 4 వస్తువులని అస్సలు పెట్టుకోకూడదట.!

by Megha Varna

Ads

మనకి తెలియకుండా మనం చేసే చిన్న చిన్న తప్పులు సమస్యలకు దారి తీస్తాయి. అయితే రాత్రిపూట నిద్ర పోయేటప్పుడు తల కింద వీటిని పెట్టుకోవడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయని తెలుస్తోంది. అనారోగ్య సమస్యలు మొదలు ఎన్నో సమస్యలు కలుగుతాయి. అయితే మరి నిద్రపోయేటప్పుడు చేసే తప్పులు గురించి, ఎటువంటి వస్తువులను తల కింద పెట్టుకో కూడదు అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం.

Video Advertisement

నిజానికి వీటిని తల కింద పెట్టుకొని నిద్రపోతే కష్టాలనే కొనితెచ్చుకున్నట్లు అవుతుంది అని వాస్తు శాస్త్రం అంటోంది. ఆర్థిక, మానసిక సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ తప్పులు చేయకండి.

#1. వాస్తు శాస్త్రం ప్రకారం నిద్ర పోయేటప్పుడు తల కింద చెప్పులు కానీ షూ ని కానీ ఉంచకూడదు. ఒకవేళ కనుక తల కింద వీటిని పెట్టుకొని నిద్రపోతే ఆరోగ్యంపై అది ఎఫెక్ట్ చూపిస్తుంది. దీంతో లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా తల కింద వీటిని పెట్టుకోకండి.
#2. అలాగే రాత్రిపూట నిద్ర పోయేటప్పుడు చదువుతూ చదువుతూ చాలా మంది తల దగ్గర పుస్తకాలని పెట్టుకొని నిద్ర పోతూ ఉంటారు. అయితే నిజానికి పుస్తకాలని తల కింద పెట్టుకొని నిద్రపోతే విద్యని అవమానించినట్లే అవుతుంది. దీంతో మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవ్వదు.


#3. సెల్ ఫోన్స్ ని లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా తల కింద పెట్టుకొని నిద్ర పోకూడదు. ఇలా చేస్తే మానసిక ఒత్తిడి కలుగుతుంది. అలానే నిద్రపై కూడా నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది.
#4. పర్సుని కానీ వాలెట్ ని కానీ కూడా తలకింద పెట్టుకుని నిద్ర పోకూడదు. ఇలా చేయడం వల్ల ఆందోళన పెరుగుతుంది. కనుక ఈ తప్పులు చేయకుండా ఉండండి లేదంటే ఇబ్బందులు తప్పవు.


End of Article

You may also like