ఈ రోడ్లు ఎందుకు బ్లూ కలర్ లో ఉంటాయి..? ప్రపంచంలో ఈ ఒక్క ప్రదేశంలోనే ఎందుకలా..?

ఈ రోడ్లు ఎందుకు బ్లూ కలర్ లో ఉంటాయి..? ప్రపంచంలో ఈ ఒక్క ప్రదేశంలోనే ఎందుకలా..?

by Megha Varna

Ads

ఎక్కువగా మనం ఎక్కడ చూసినా తార్ రోడ్లు ఉంటాయి. కానీ ప్రపంచంలో ఈ ఒక్క దేశంలోనే నీలం కలర్ రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్ల లో తార్ ఉండదట. చాలా కొత్తగా వుంది కదా..? మరి ఇక్కడ రోడ్లు ఎలా వేశారు..? నిజంగా ఈ పద్దతి చాలా వింతగా వుంది. మరి ఇక ఈ వింత రోడ్డు గురించి క్లుప్తంగా చూసేద్దాం.

Video Advertisement

అసలు ఈ నీలం కలర్ రోడ్డు ఎక్కడ వుంది అనేది చూస్తే.. ఈ రోడ్లు ‘ఖతార్’ ప్రాంతం లో వేశారు. ఈ రోడ్లు నీలం రంగులో ఉంటాయి. దీనికి గల కారణం ఏమిటంటే సౌదీ అరేబియా ప్రాంతం లో ఎడారులు ఎక్కువగా ఉంటాయి. దీనితో అక్కడ ఉష్ణోగ్రత 50 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే దీని కారణంగా పెయింట్ రంగు మారిపోవడం, ప్లాస్టిక్ కరిగిపోవడం వంటి మొదలైన సమస్యలు వస్తూ ఉంటాయి.

అందుకని ఈ సమస్యను పరిష్కరించాలని అక్కడ రోడ్ల మీద వినూత్నమైన మార్పు చేశారు. అదేంటంటే ఒక మిల్లీ మీటర్ మందం తో టెంపరేచర్ బాగా రిఫ్లెక్ట్ చేసే విధంగా నీలం రంగు పెయింట్ ని రోడ్డు మీద వేయడం జరిగింది. అందుకే ఇక్కడ రోడ్లు బ్లూ కలర్ లో ఉంటాయి. ఈ ఐడియా నిజంగా బాగా వర్క్ అవుట్ అయ్యింది. దీని కారణంగా రాజధాని దోహే లో కూడా రోడ్ల కి బ్లూ కలర్ వేయడం జరిగింది.


End of Article

You may also like