Ads
ఎంతో కష్టపడితే కానీ మన చేతికి డబ్బులు రావు. అయితే కష్టపడకుండా వచ్చిన సొమ్ము ఎక్కువ కాలం నిలవదు అని కూడా అంటూ ఉంటారు. అందుకని ఎప్పుడూ కూడా ఫ్రీగా వచ్చిన డబ్బులు తీసుకోకూడదు. ఇది ఇలా ఉంటే ఒక్కొక్కసారి మనకు రోడ్డు మీద డబ్బులు దొరుకుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువగా చిల్లర నాణాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఎప్పుడైనా చిల్లర నాణాలు రోడ్డు మీద కనబడ్డాయంటే ఒక సారి ఆగి అక్కడ ప్రదేశాన్ని చూడండి.
Video Advertisement
మీకు డబ్బులు దొరికిన చుట్టుపక్కల ప్రాంతాలలో ఏమైనా స్మశానం ఉందేమో చూడండి. ఎందుకంటే అంతిమయాత్రకి తీసుకు వెళ్తున్నప్పుడు మృత దేహం పైన పూలు, చిల్లర జల్లుకుంటూ వెళ్తూ ఉంటారు. కాబట్టి రోడ్డు పై చిల్లర కనపడినప్పుడు స్మశానం ఏదైనా ఉందేమో చూసుకోవాలి. ఒకవేళ అలాంటిది ఏమీ లేదు అంటే ఆ చిల్లరని తీసుకు వెళ్లి ఏదైనా దేవాలయంలో వేస్తే మంచిది.
దేవాలయంలో చిల్లర వేశాక డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటే వాళ్ళ యొక్క ఉసురు మనకి తగలదు. ఒకవేళ మీరు దేవుని సన్నిధిలోకి వెళ్ళినట్లయితే ఆ డబ్బుల్ని ఏదైనా యాచకుడికి వేస్తే కూడా మంచి కలుగుతుంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి పాపం మీకు తగలదు. కనుక ఎప్పుడూ కూడా ఇతరుల సొమ్ము మనం ఉంచుకోకూడదు అని గుర్తుంచుకోండి.
అలాంటి సొమ్ము ఇంటికి వచ్చినా దాని వల్ల ఫలితం ఉండదు. ఎప్పుడు కూడా కష్టపడి సంపాదించిన డబ్బుకి మాత్రమే ఫలితం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇతరులు డబ్బు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. కనుక ఒక వేళ రోడ్డు మీద ఏమైనా డబ్బులు కనబడితే తీసుకోకండి లేదు అంటే పైన చెప్పిన విధంగా పాటించండి. అంతే కానీ ఆ డబ్బులు మీరు ఇంటికి తీసుకెళ్ళినట్లయితే ఒకరి మనోవేదనను మనము అనుభవించినట్లు. కాబట్టి ఎప్పుడూ ఈ తప్పు చేయద్దు.
https://telugustop.com/do-you-know-what-a-sign-of-found-money-in-the-road-%E0%B0%A1%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B1%81%E0%B0%B2%E0%B1%81
End of Article