నలభై ఏళ్ళు దాటిన పురుషులు వీటిని తీసుకుంటే సమస్యలు తప్పవు..!

నలభై ఏళ్ళు దాటిన పురుషులు వీటిని తీసుకుంటే సమస్యలు తప్పవు..!

by Megha Varna

Ads

ఈ మధ్యకాలంలో చాలా మందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండానే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే 40 ఏళ్ళు దాటిన వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. 40 ఏళ్లు దాటితే గుండె సమస్యలు, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, షుగర్, బీపీ ఇలా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

Video Advertisement

అటువంటి సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే మంచి జీవన విధానాన్ని అనుసరించాలి. 40 ఏళ్లు దాటిన పురుషులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు లేకుండా ఉండొచ్చు. ఈ ఆహార పదార్థాలుకి 40 ఏళ్లు దాటిన వారు దూరంగా ఉంటే చాలా సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో చూద్దాం.

#1. చక్కెర, చక్కెర తో చేసిన పదార్థాలు:

పంచదారకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలానే పంచదారతో తయారు చేసిన స్వీట్లు వంటి వాటికి కూడా దూరంగా ఉండండి. పంచదార వల్ల ఆరోగ్యానికి హాని మాత్రమే కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. వీలైతే పంచదారకు బదులుగా మీరు బెల్లం వంటివి ఉపయోగించండి.

#2. బేకరీ లో దొరికే ఆహార పదార్థాలు:

బేకరీలో తయారు చేసే చాలా ఆహార పదార్థాలు కారణంగా చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. గుండె జబ్బులకు కూడా ఇది దారి తీస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండండి.

#3. టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవద్దు:

చాలామంది రోజుకి ఎన్నిసార్లు అయినా టీ, కాఫీలను తాగుతూ ఉంటారు. అటువంటి అలవాటు ఉంటే మానుకోవడం మంచిది. వీటిని ఎక్కువగా తీసుకుంటే అజీర్తి, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి లిమిట్ గా తీసుకోండి లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

#4. సాల్ట్ కి దూరంగా ఉండండి:

ఎందులో పడితే అందులో సాల్ట్ ఎక్కువగా వేసుకుని ఆహార పదార్థాలు తీసుకోవద్దు. 40 ఏళ్ళు దాటిన పురుషులు సాల్ట్ ని తగ్గించండి లేదు అంటే రక్తపోటు అదుపులో ఉండదు. దీని వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే విధంగా ప్రాసెస్డ్ మీట్, ఆయిల్, మైదా, బ్రెడ్, ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఫ్రైడ్ ఫుడ్స్ వంటివాటికి దూరంగా ఉండాలి. లేదంటే వయసు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి.


End of Article

You may also like