Ads
కొన్ని కొన్ని హోటల్లో మరియు బట్టలు మార్చుకునే రూమ్లలో సీసీ కెమెరాలను పెడుతూ ఉంటారు. ఈ కెమెరాలు ఉండడం వల్ల మోసపోయే అవకాశం వుంది. అందుకనే ఎప్పుడూ కూడా ఏదైనా హోటల్ కి కానీ లేదు అంటే బట్టలు మార్చుకోవడానికి వెళ్లేటప్పుడు కానీ కెమెరాలు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఈ పద్ధతులు మీరు ఫాలో అయ్యారంటే సులభంగా కెమెరాలు ఉన్నాయో లేదో కనిపెట్టచ్చు. అయితే మరి కెమెరాలు ఉన్నాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1. కెమెరాల కోసం వెతకండి:
కెమెరాలు చాలా రకాల సైజులలో ఉంటాయి. అలాగే వాటి యొక్క రెసొల్యూషన్స్ కూడా వేరువేరుగా ఉంటాయి. చాలా కెమెరాలకి మోషన్ సెన్సార్ వుంటుంది. ఎప్పుడైనా ఏదైనా వాటి దగ్గరి కదిలింది అంటే అప్పుడు అవి యాక్టివేట్ అవుతాయి. మీరు మొదట గదిలో వాటికోసం చూసుకోండి.
#2. సాధారణ వెలుతురులో వెతకండి:
ఏదైనా కెమెరా ని ఫిక్స్ చేశారు అంటే ఆ కెమెరా డైరెక్టుగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. మధ్యలో అడ్డం ఏమీ ఉండదు. మీరు సాధారణ వెల్తురు లో వాటి కోసం వెతకండి. అలానే గది లో మీకు వింతగా అనిపించే వస్తువుల గురించి కూడా చూడండి. కొన్ని కొన్ని సార్లు వస్తువుల్ని పెట్టి కెమెరాని లేనట్లు అనుమానం కలగకుండా చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా వాటికోసం పరిశీలించండి.
#3. శబ్దం వస్తుందో లేదో వినండి:
బాత్రూం లో మరియు బట్టలు మార్చుకునే గది లో చిన్నపాటి శబ్దం ఏదైనా వస్తుందేమో జాగ్రత్తగా వినండి. కెమెరాలను కనెక్ట్ చేసినప్పుడు చిన్న శబ్దం వస్తుంది. వీటిని మీరు జాగ్రత్తగా వింటే శబ్దం ఏదైనా వస్తోందేమో విని కనిపెట్టచ్చు.
#4. లైట్లు ఆపేసి స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించండి:
గదిలో ఉన్న లైట్లన్నీ ఆపేసి మీ ఫోన్ లో ఉండే ఫ్రంట్ కెమెరా ని ఆన్ చేయండి. స్పాట్ లైట్ లాంటివి ఏమైనా కనబడితే అక్కడ కెమెరా ఉందని మీరు తెలుసుకోవచ్చు.
ఎక్కువగా కెమెరాలని స్మోక్ డిటెక్టర్స్, ఎలక్ట్రికల్ ఔట్లెట్స్ వంటి పవర్ అడాప్టెర్స్, డిజిటల్ టీవీ మరియు ఇంటర్నెట్ బాక్స్, వాల్ సాకెట్స్, ఎయిర్ ఫిల్టర్ ఎక్విప్మెంట్, లేదా అలారమ్ క్లాక్స్ వద్ద పెడతారు. లేదు అంటే గడియారాలు, పెన్స్, లావా లాంప్స్, టిష్యూ బాక్స్, పుస్తకాల షల్ఫ్స్ వంటి వాటి వద్ద కూడా ఎక్కువగా పెడుతుంటారు.
End of Article