ట్రైన్ ప్రయాణాల్లో ఎదురయ్యే ఈ స్కామ్ గురించి తెలుసా..? ఎంత తెలివిగా ఫోన్లు దోచేస్తున్నారో చూడండి..!

ట్రైన్ ప్రయాణాల్లో ఎదురయ్యే ఈ స్కామ్ గురించి తెలుసా..? ఎంత తెలివిగా ఫోన్లు దోచేస్తున్నారో చూడండి..!

by Megha Varna

Ads

మొబైల్ ఫోన్లని ఎక్కువ మంది దొంగలిస్తూ ఉంటారు. మనం ఏదైనా పబ్లిక్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఎక్కువగా మొబైల్ ఫోన్ ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు చేతిలో ఉన్న ఫోన్ సడన్ గా మాయమైపోతుంది. చిటికలో మొబైల్ ఫోన్లని దొంగలిస్తూ ఉంటారు.

Video Advertisement

ట్రైన్ లో కూడా ఎక్కువ మంది సెల్ ఫోన్స్ ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ట్రైన్ లో ఉన్న వాళ్ళ ఫోన్లను ఎలా లాక్కుంటారు, స్కామ్స్ ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. కళ్ళ ముందు మొబైల్ ఫోన్ పట్టికెళ్ళిపోయినా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.

సాధారణంగా మనం దిగాల్సిన రైల్వేస్టేషన్ వస్తే వచ్చి డోర్ దగ్గర నించుని ఉంటాము. నించునేటప్పుడు హఠాత్తుగా రన్నింగ్ ట్రైన్ లోకి ఒక వ్యక్తి వచ్చి చేతిలో ఉన్న ఫోన్ లేదా బ్యాగులను లాక్కుని వెళ్ళి పోతూ ఉంటాడు. ఇలా చాలా మంది వాళ్ళ యొక్క వస్తువుల్ని కోల్పోతుంటారు.
అలానే రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ మీద దొంగిలించే వాళ్ళు నించొని ట్రైన్ లో ఉండే వ్యక్తిని కొడతాడు. దానితో చేతిలో ఉండే ఫోన్ కింద పడిపోతుంది. ఒక్కొక్కసారి ఆ వ్యక్తి కూడా కింద పడి పోయే అవకాశం ఉంటుంది.

కొంత మంది ఎవరైనా ఫోన్ ని వాడుతూ ఉంటే వాళ్ళ వెనకాల నించుని ట్రైన్ డోర్ ఓపెన్ అవగానే ఫోన్ లాక్కుని వెళ్ళిపోతాడు. ఫోన్ కోసం వెనకాల వెళ్లినా ఫలితం ఉండదు. వెంటనే డోర్ లాక్ అయిపోతుంది. ఇలా కూడా ఫోన్లను దొంగతనం చేస్తూ ఉంటారు.
రైలు డోర్ దగ్గర ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఏదైనా వస్తువులు పెట్టి కొట్టి దొంగతనం చేసేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా ట్రైన్లలో కిటికీ దగ్గర నుంచుని ఎక్కువ ఫోన్ ఉపయోగించద్దు. ముఖ్యంగా వీడియోలు తీయడం లాంటివి చేయకండి. ఇలా చేయడం వల్ల ఫోన్లని ఎక్కువగా దొంగలిస్తూ వుంటారు. ఫోన్ పోవడమే కాకుండా కింద పడడం, దెబ్బలు తగలడం లాంటివి కూడా జరగొచ్చు.

Watch Video:


End of Article

You may also like