వేశ్య వల్ల కాశీకి వెళ్ళలేదు.. ఆమె వక్షోజాలనే శివలింగంగా భావించి పూజించాడు..! చివరికి ఏమైంది?

వేశ్య వల్ల కాశీకి వెళ్ళలేదు.. ఆమె వక్షోజాలనే శివలింగంగా భావించి పూజించాడు..! చివరికి ఏమైంది?

by Harika

Ads

ఆ పరమేశ్వరుడు భక్త సులభుడు. చేతులారా నమస్కారం పెట్టి..చెంబుడు నీళ్లు పోసి అభిషేకం చేస్తే పరమ సంతుష్టుడౌతాడు. భక్తులను ఎల్లవేళలా కాపాడుతాడు. మనం చేసిన పొరపాట్లను కూడా క్షమిస్తాడు అనడానికి ఈ కధే ఉదాహరణ.

Video Advertisement

ఇప్పుడు మనం చెప్పుకునేది ఎపి లో వెస్ట్ గోదావరి జిల్లాలోని ఆచంట వద్దనున్న రామేశ్వర దేవాలయం గురించి. ఆ స్థలం ప్రత్యేకతను, ఆ దేవాలయానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకుందాం.

achanta rameswarudu

తారకాసుర సంహారం జరిగిన తరువాత.. ఓ రోజు శివపార్వతులిద్దరు రతిక్రీడలో మునిగి తేలుతుంటారు. అదే సమయం లో.. వారిద్దరిని దర్శించుకోవడానికి పుష్పసుందరుడు, పుష్పసుందరి అనే ముని దంపతులు వస్తారు. శివ పార్వతుల శృంగారాన్ని వారు చూడడం తో కోపించిన పరమశివుడు వారిద్దరిని తిరిగి బ్రహ్మ చర్యను పాటించి ఆ తరువాత శివసాయుజ్యాన్ని పొందాలని శపిస్తాడు. శివుని శాప ఫలితం గా వారిద్దరూ భువిపై జన్మిస్తారు.

achanta rameswaram

పుష్ప సుందరుడు ఒడయనంబి అనే బ్రాహ్మణుడిగా జన్మిస్తారు. అతని భార్య అయిన పుష్పాసుందరి మాత్రం మార్తాండాపురం లోని కళావతుల ఇంట పరమనాచీ గా పుడుతుంది. ఆ తరువాత వే-శ్య గా మారుతుంది. ఇది ఇలా ఉంటె.. ఓ సారి ఒడయనంబి మహాశివరాత్రి కి జాగరణ, పూజలు చేసి శివుడ్ని దర్శించుకోవడం కోసం కాశీ కి బయలుదేరుతాడు. మార్గం మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ వెళ్తూ ఉండేవాడు. అలా మార్తాండపురానికి చేరుకుంటాడు. అక్కడ అతనికి వేశ్య అయిన పుష్ప సుందరి ఇంట వసతి లభిస్తుంది.

lord siva 2

అక్కడకు వెళ్ళగానే ఆ వే-శ్య అందాన్ని చూసి ఒడయనంబి మైమరిచిపోతాడు. తానెందుకు వచ్చాడో కూడా మరిచిపోతాడు. ఒడయనంబి కి ఆ వే-శ్య గత జన్మ లో తన భార్యేనన్న విషయం తెలియదు. తన్మయత్వం తో అక్కడే కొన్ని రోజులు గడిపేస్తాడు. ఓ రోజు ఆ ఊళ్ళోనే ఉన్న శివాలయం నుంచి పంచాక్షరీ మంత్రం వినిపిస్తుంది. వెంటనే అతనికి తానెందుకు వచ్చాడో గుర్తుకు వస్తుంది. ఆరోజు మహా శివరాత్రి. తాను కర్తవ్యం మరిచిపోయినందుకు ఒడయనంబి చింతిస్తాడు. అయితే.. అక్కడ ఏమైనా శివలింగ రూపాలు ఏమైనా ఉన్నాయేమో వెతుకుతాడు.

achanta rameswaram 2

అతనికి ఏమి కనిపించవు. కళ్ళ ఎదురుకుండా ఆ వే-శ్య న-గ్నం గా పడుకుని ఉంటుంది. ఆమె వక్షో-జాలను శివలింగం గా భావిస్తూ.. ఒడయనంబి శివుడిని తలుచుకుని పూజిస్తాడు. ఆ రాత్రంతా జాగారం చేస్తూ పూజలు చేస్తూనే ఉంటాడు. ఆ తరువాత అలసట తో ఒడయనంబి పడిపోతాడు. అతడి భక్తికి మెచ్చి ఆ పరమశివుడు ప్రత్యక్షం అయ్యి ఏమి కావాలో కోరుకోమంటాడు. తనకు మోక్షం కావాలని ఒడయనంబి కోరతాడు. అతనితో పాటు ఆ వేశ్యకు కూడా పరమశివుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు.

lord siva

ఆ తరువాత కాలం లో.. ఆ ప్రాంతం లోనే దేవాలయాన్ని నిర్మిస్తారు. ఈ దేవాలయం లో లింగం స్త్రీల వక్షోజాలను పోలి ఉంటుంది. శ్రీ రాముడు కూడా రావణాసురుడిని చంపినా తరువాత బ్రహ్మ హ-త్యా పాతకాన్ని పోగొట్టుకోవడం కోసం ఇక్కడ పూజలు చేసాడట. ఆ రాముని కి కూడా హత్య పాతకం పోతుంది. అందుకే ఈ ఈశ్వరాలయానికి రామేశ్వరాలయం అని పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ లింగానికి స్త్రీలు పూజ చేస్తే.. వారి అనారోగ్య సమస్యలు, దాంపత్య సమస్యలు, సంతాన సమస్యలు తీరతాయని.. ఆ పరమేశ్వరుడు స్త్రీలపై ఎక్కువ కరుణ చూపించి కాపాడతాడని చెబుతుంటారు. మహా శివరాత్రి సమయం లో కూడా ఐదు రోజుల పాటు ఇక్కడ విశేష పూజలను నిర్వహిస్తూ ఉంటారు.


End of Article

You may also like