విమానంలో ప్రయాణం చేసేవాళ్ళకి పారాచూట్ ఎందుకు ఇవ్వరో తెలుసా..?

విమానంలో ప్రయాణం చేసేవాళ్ళకి పారాచూట్ ఎందుకు ఇవ్వరో తెలుసా..?

by Megha Varna

Ads

సమయాన్ని సేవ్ చేసుకుని త్వరగా మనం గమ్య స్థానానికి చేరుకోవడానికి విమాన ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. పైగా ప్రయాణం చేసినట్టు కూడా మనకి అనిపించదు. మామూలుగా రైలులో కానీ బస్సు లో కానీ వెళుతూ ఉంటే ఎక్కువ సమయం కేవలం వెళ్ళడానికి సరిపోతుంది.

Video Advertisement

కానీ మనం విమానంలో ప్రయాణం చేసినప్పుడు గంట లేదా రెండు గంటల్లో మనం గమ్య స్థానానికి చేరుకోవడానికి అవుతుంది. అయితే విమాన ప్రయాణం చేసినప్పుడు పారాచూట్ మనకి ఇవ్వరు. ఈ విషయం అందరికీ తెలిసిందే. మిలటరీ ఎయిర్ క్యాప్స్ లేదా ఫైర్ జెట్స్ లో చూసుకున్నట్లయితే అందులో ప్రయాణం చేసే వారికి పారాచూట్ ఇస్తూ ఉంటారు.

ఎందుకు విమానంలో ప్రయాణం చేసే వాళ్ళకి పారాచూట్ ఇవ్వరు..? మరి మిలటరీ ఎయిర్ కాప్స్ లేదా ఫైర్ జెట్స్ లో ప్రయాణం చేసినప్పుడు ఎందుకు పారాచూట్ ని ఇస్తారు అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. మీకు కూడా ఈ సందేహం ఉందా..? అయితే ఇప్పుడు తెలుసుకుందాం.

దీనికి గల కారణాలు రెండు. మొదటిది చూసుకున్నట్లయితే పారాచూట్ తో పాసింజర్ విమానం లో కూర్చోవాలంటే ఎక్కువ స్పేస్ కావాలి. అలానే పారాషూట్ ధర ఎక్కువగా ఉంటుంది విమానం టికెట్ కంటే కూడా పారాచూట్ ధర ఎక్కువ. ఇది ఒక కారణం. మరొక కారణం ఏమిటంటే పారాచూట్ ఉపయోగించాలంటే అనుభవం ఉండాలి.

ఎప్పుడు, ఎలా ఉపయోగించాలి అన్నది తెలిసి ఉండాలి. అలానే ఫ్లైట్ లో నుంచి జంప్ చేయాలంటే రాంప్ ఉండదు. ఎమర్జెన్సీ డోర్ నుండి మాత్రమే జంప్ చేయాలి. ఇలా జంప్ చేసినప్పుడు విమానం యొక్క రెక్కకి గుద్దుకునే అవకాశం ఉంది. ఇలా ఈ కారణాల వల్ల ఫ్లైట్ లో ప్రయాణం చేసే వాళ్ళకి పారాచూట్ ని ఇవ్వరు.


End of Article

You may also like