Ads
ఒక్కొక్కసారి మనకి కలలో చాలా వింత అయినవి కనబడుతూ ఉంటాయి. పాము మన వెంట తరుముతూ రావడం, లేదంటే నీళ్ళలో పడి పోవడం ఇలా చాలా భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి. అలానే ఒక్కొక్క సారి చనిపోయిన కుటుంబ సభ్యులు లేదా బంధు మిత్రులు కలలో కనబడుతూ వుంటారు.
Video Advertisement
ఒకవేళ కనుక కలలో చనిపోయిన వాళ్ళు కనపడ్డారు అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. అయితే కలలో చనిపోయిన వాళ్ళు కనబడితే ఏమౌతుంది..? ఏదైనా సమస్య కలుగుతుందా..?
అలా కనపడితే మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా..? అనే వాటి గురించి చూద్దాం. స్వప్న శాస్త్రం ప్రకారం చూస్తే చనిపోయిన వాళ్ళు కలలో కనపడ్డారు అంటే వారి ఆత్మ ఈ లోకం లో సంచరిస్తుంది అని అర్థం. చనిపోయిన వాళ్ళ కలలో కనపడితే వాళ్ళ పేరున రామాయణం కానీ భగవద్గీత కానీ చదవాలి.
ఒకవేళ కనుక కలలో చనిపోయిన వాళ్ళు ఎంతో బాధగా ఉంటూ మీకు కనపడితే అప్పుడు మీరు ఏదో తప్పు చేయబోతున్నారని దానికి అర్థం. ఒకవేళ ఆకలితో కనబడ్డారు అంటే పేదలకు అన్నదానం చేస్తే మంచిది. కోపం తో కనుక వాళ్ళు కనపడ్డారు అంటే వాళ్లు మీ నుంచి ఏదో ఆశిస్తున్నారు అని అర్ధం.
కాబట్టి మీరు ఈ విధంగా అనుసరిస్తే వారి యొక్క ఆత్మ సంతృప్తి చెందుతుంది. అదే ఒకవేళ వాళ్ళు నవ్వుతూ కనిపిస్తే మీరు శుభ ఫలితాలు పొందవచ్చని. అయితే ఒకవేళ చనిపోయిన వాళ్ళు ఎవరైనా మీ కల లో కనపడి ఏదైనా చేయమని చెప్తే కచ్చితంగా చేయండి.
End of Article