బైక్ హ్యాండిల్ చివర్లో ఇది ఎప్పుడైనా గమనించారా.? అది కేవలం డిజైన్ కోసం అనుకుంటే మీ పొరపాటే.!

బైక్ హ్యాండిల్ చివర్లో ఇది ఎప్పుడైనా గమనించారా.? అది కేవలం డిజైన్ కోసం అనుకుంటే మీ పొరపాటే.!

by Megha Varna

Ads

బైకులు, కార్లు వంటి వాటిని మనం చూసినప్పుడు చాలా రకాల పార్ట్స్ తో వాటిని తయారు చేయడం జరుగుతుంది. అయితే కొన్ని కొన్ని సార్లు ఎందుకు ఆ పార్ట్స్ ని ఫిక్స్ చేసారు అనేది కూడా మనకి తెలియదు. నిజానికి ప్రతి ఒక్క దాని వల్ల కూడా ఉపయోగం ఉంటుంది.

Video Advertisement

 

అయితే బైక్ కి కూడా హ్యాండిల్ దగ్గర ఒక చిన్న భాగం ఉంటుంది. అయితే అది ఎందుకు ఉందో చాలా మందికి తెలియదు. అసలు ఆ భాగం వల్ల ఉపయోగం ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా..? మరి దీని కోసం ఇప్పుడు చూద్దాం.

బైక్ హ్యాండిల్ ఎండింగ్ లో చిన్న భాగం ఉంటుంది. దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాగే అది కేవలం డిజైన్ ఏమో అని కొంత మంది అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఈ భాగం వల్ల చాలా ఉపయోగం ఉంది. వీటినే బార్ అండ్ వెయిట్ అని పిలుస్తారు. అయితే మరి దీని వల్ల ఉపయోగం ఏమిటి అనేది చూస్తే.. ఇది వైబ్రేషన్స్ ని కంట్రోల్ చేస్తుంది.

సాధారణంగా మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు గతుకులు, స్పీడ్ బ్రేకర్ లాంటివి ఉంటాయి. అయితే కొన్ని వైబ్రేషన్స్ ఇంజన్ నుంచి వస్తాయి. ఇంజన్ నుండి వచ్చే వైబ్రేషన్స్ ని షాక్ అబ్సర్బెర్స్ గ్రహించలేవు. అందుకనే బైక్ ని ఇలా డిజైన్ చేయడం జరుగుతుంది. ఇవి వైబ్రేషన్స్ ని కంట్రోల్ చేస్తాయి. ఒకవేళ కనుక బండికి ఇవి లేవు అంటే మనం కంఫర్టబుల్ గా డ్రైవ్ చేయలేము. బ్లడ్ ఫ్లో అనేది మారిపోయి బండి డ్రైవ్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది.

అలానే బండి షేక్ అవకుండా ఉండడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇవి లేకపోతే హ్యాండిల్ షేక్ అవుతూ ఉంటుంది. అలాగే ఒకవేళ కనుక స్కిడ్ అయ్యి మనం పడిపోతే ఈ బార్ అండ్ వెయిట్స్ ముందు కిందపడి మనకు ఏమీ కాకుండా చూస్తాయి. అలానే బండి హ్యాండిల్ కూడా దెబ్బతినదు.


End of Article

You may also like