Ads
ఎక్కువగా మనం వందలు, వేలు, పది వేలు ఇలాంటి పదాలని వాడుతూ ఉంటాము. దేనినైనా లెక్క పెట్టడానికి ఎక్కువగా వీటిని ఉపయోగిస్తూ ఉంటాము. పైగా మనం ఫుల్ గా రాయకుండానే షార్ట్ కట్ లో రాస్తూ ఉంటాము. దీంతో మనం సమయాన్ని సేవ్ చేసుకుని షార్ట్ కట్ లో రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అయితే ఎప్పుడైనా పదివేల కి షార్ట్ కట్ చూస్తే… 10k అని రాస్తూ ఉంటాము.
Video Advertisement
అయితే ఎందుకు k అని ఉపయోగించాలి…? మిలియన్ కి M అని వాడతాము కదా..? మరి వెయ్యికి T అని ఎందుకు వాడకూడదు..? K అని ఎందుకు రాయాలి..? ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది.
మీకు కూడా ఎప్పుడైనా ఈ సందేహం కలిగిందా..? అయితే మరి ఇక్కడ మీ సందేహాన్ని క్లియర్ చేసుకోండి. మిలియన్ కి M అని వాడతాము. కానీ వెయ్యికి మాత్రం టీ అని కాకుండా కే అని రాస్తూ ఉంటాము. అయితే కొన్ని నివేదికల ప్రకారం చూసుకున్నట్లయితే కే అనేది గ్రీకు పదం.
దీనికి 1000 అని అర్థం. గ్రీకులో వెయ్యికి కె అని రాస్తూ ఉంటారు. బైబిల్ లో కూడా దీని గురించి చెప్పడం జరిగింది. గ్రీక్ తర్వాత ఫ్రెంచ్ వారు కూడా ఈ పదాన్ని తీసుకుని దీనిని ఉపయోగించడం మొదలుపెట్టారు. ఈ పదం తర్వాత కిలో కింద మారింది. 1000 తో ఎక్కడైతే గుణించాలో అక్కడకి దీనిని వాడేవారు.
అంటే వెయ్యి గ్రాములు అంటే కిలోగ్రాము.. 1,000 లీటర్లు అంటే కిలోలీటర్లు ఇలా అన్నమాట. దీంతో K అని అందరూ వాడడం మొదలుపెట్టారు. అందుకే మనం ఎప్పుడైనా 10,000 రాయాల్సి వస్తే 10K అని రాస్తాము. 20000 రాయాలంటే 20K అని రాస్తాము. అదే 50 వేలు ఉంటే 50K అని వ్రాస్తాము. అంతేకానీ మనం 10T అని 20T అని రాయము.
End of Article