టాబ్లెట్ స్ట్రిప్ మీద “ఎర్రటి లైన్” ఉంటే దానికి అర్ధం ఏమిటో తెలుసా..?

టాబ్లెట్ స్ట్రిప్ మీద “ఎర్రటి లైన్” ఉంటే దానికి అర్ధం ఏమిటో తెలుసా..?

by Megha Varna

Ads

ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందంటే పూర్వం ఎక్కువగా ఇంటి చిట్కాలను పాటించే వారు. కానీ ఇప్పుడు మాత్రం మనం టాబ్లెట్లు మీద ఆధారపడ్డాము. డాక్టర్ల వద్దకు వెళ్ళినా సరే మనకి ఏదో ఒక టాబ్లెట్ ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు డాక్టర్లు. అయితే చాలా మందికి టాబ్లెట్లు మీద ఉండే లైన్ గురించి తెలియదు.

Video Advertisement

టాబ్లెట్స్ స్ట్రిప్ వెనకాల ఎర్రటి లైన్ ఉంటే అది దేనికి సంకేతం అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకి అవసరమైన విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఎందుకంటే మనకు అవసరమైన విషయాలు మనకి తెలిసాయి అంటే ఏ ఇబ్బందులు ఉండవు. అలానే ఏ తప్పు కూడా మనం చేయకుండా ఉండడానికి అవుతుంది. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే టాబ్లెట్ల స్ట్రిప్ వెనకాల ఎర్రటి లైన్ ఉంటే అది దేన్ని ఇండికేట్ చేస్తుంది అనే దాని గురించి ఇప్పుడు చూసేద్దాం.

టాబ్లెట్ బాక్స్ మీద కానీ స్ట్రిప్ మీద కానీ రెడ్ లైన్ ఉంది అంటే ఆ టాబ్లెట్లని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా తీసుకోకూడదు. ఎందుకంటే వీటిలో చాలా పవర్ వుంటుంది. కొన్ని సార్లు మనం డాక్టర్లు చెప్పకుండానే టాబ్లెట్లను ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఇలాంటి టాబ్లెట్స్ ని డాక్టర్లు చెప్పకుండా అస్సలు ఉపయోగించకూడదు.

ఒకవేళ కనుక మీరు మందుల షాప్ కి వెళ్లినప్పుడు ఇలాంటి టాబ్లెట్లని కనుక వాళ్ళు ఇచ్చారంటే అసలు తీసుకోవద్దు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రమే టాబ్లెట్ ని కొనుగోలు చేయండి. వైద్యుల సలహా లేకుండా ఇలాంటివి వాడకూడదు. సాధారణంగా ఏ మందులు షాపు వాళ్లు కూడా ఇలాంటి టాబ్లెట్లని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వరు. ఇచ్చినా తీసుకోకండి.


End of Article

You may also like