బిస్కెట్ మీద ఎందుకు చిన్న చిన్న రంధ్రాలు వుంటాయో మీకు తెలుసా..?

బిస్కెట్ మీద ఎందుకు చిన్న చిన్న రంధ్రాలు వుంటాయో మీకు తెలుసా..?

by Megha Varna

Ads

తరచూ మనం బిస్కెట్లని తింటూనే ఉంటాము. టీ లో కానీ కాఫీలో కానీ బిస్కెట్లని ముంచుకుని తీసుకుంటూ ఉంటాము. అయితే ఎప్పుడైనా బిస్కెట్ల మీద ఉండే రంధ్రాలని గమనించారా…? ఎందుకు ఈ రంధ్రాలని బిస్కెట్ల మీద ఉంచుతారు అన్న సందేహం ఎప్పుడైనా కలిగిందా..? అయితే మరి ఇప్పుడే దాన్ని క్లియర్ చేసుకోండి.

Video Advertisement

కొన్ని రకాల బిస్కెట్లను చూసినట్లయితే వాటి మీద చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. అది కేవలం డిజైన్. దాని వల్ల ఉపయోగం ఏమీ లేదు అని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. బిస్కెట్ల మీద చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి.

వాటిని డాకర్ హోల్స్ అని అంటారు. కొన్ని రకాల క్రీమ్ వేసిన బిస్కెట్ లలో మరియు స్వీట్ అండ్ సాల్ట్ బిస్కెట్స్ పైన ఇలాంటి హోల్స్ ఉంటాయి. అయితే ఇలా ఉండడం వల్ల బేకింగ్ జరిగే సమయంలో గాలి పాస్ అవుతుంది. దీంతో బిస్కెట్ విరిగిపోకుండా ఉంటుంది.

బిస్కెట్లను తయారు చేసినప్పుడు పిండి, పంచదార మరియు సాల్ట్ అన్నీ ట్రే లో వేసి మిషన్ లో పెడతారు. ఈ మిషన్ బిస్కెట్ మీద హోల్ ని ఏర్పాటు చేస్తుంది. ఒకవేళ కనుక ఈ రంధ్రాలు లేకపోతే బిస్కెట్ అనేది ఉబ్బిపోతుంది. అలానే బిస్కెట్ సైజు కూడా పెద్దదై పోతుంది. అదే రంధ్రాలు ఉంటే బిస్కెట్ సైజ్ మొత్తం అంతా కూడా సమానంగా ఉంటుంది.

ప్రతి కార్నర్ లో కూడా బేక్ అవుతుంది. దీంతో బిస్కెట్లు బాగుంటాయి. బేకింగ్ చేసే సమయంలో ఈ రంద్రాలు లేకపోతే బేకింగ్ అవ్వదు. హీట్ అందులో నుండి బయటికి వెళ్ళదు. అలానే బిస్కెట్ల టెంపరేచర్ అన్ స్టేబుల్ గా ఉంటుంది. బిస్కెట్లు పైన క్రాక్స్ కూడా వచ్చేస్తాయి.


End of Article

You may also like