టామ్ అండ్ జెర్రీ లో ఇది ఎప్పుడైనా గమనించారా.? “మనుషుల” ముఖాలు ఎందుకు కనపడవో తెలుసా..?

టామ్ అండ్ జెర్రీ లో ఇది ఎప్పుడైనా గమనించారా.? “మనుషుల” ముఖాలు ఎందుకు కనపడవో తెలుసా..?

by Megha Varna

Ads

చిన్న పిల్లలకి కార్టూన్ నెట్వర్క్ చూడడం అంటే ఎంతో ఇష్టం. అలా ఆకర్షించే వాటిలో టామ్ అండ్ జెర్రీ కూడా ఒకటి. చాలా మంది చిన్న పిల్లలు టామ్ అండ్ జెర్రీ ని చూడడానికి ఇష్ట పడుతూ ఉంటారు. అయితే అది చూసినంత సేపు ఎంతో సరదాగా ఉంటుంది.

Video Advertisement

టామ్ అండ్ జెర్రీ ని చూసినట్లయితే మనుషుల ముఖాలను అస్సలు చూపించరు. అయితే దీని వెనుక కారణం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకవేళ మనుషుల మధ్య మధ్య లో వచ్చినా వాళ్ళ ముఖం అసలు కనపడవు. దీనికి గల కారణం ఏమిటంటే..? సాధారణంగా ఈ కథ మొత్తం టామ్ మరియు జెర్రీ మధ్యలో జరుగుతూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడూ మనుషుల క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి అయినప్పటికీ వాళ్ల ముఖాన్ని చూపించరు.

ఒకవేళ కనుక వాళ్ల ముఖాన్ని కనుక చూపించాలంటే ముఖానికి తగ్గట్టు మళ్లీ వాయిస్ ని కూడా యాడ్ చేయాలి. పైగా ఆ సందర్భానికి తగ్గట్టు వాళ్ళ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ని కూడా మారుస్తూ ఉండాలి. నిజానికి ఇది చాలా పెద్ద ప్రాసెస్. పైగా దీనిని చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. పైగా ఎక్స్ట్రా పని కూడా. బడ్జెట్ పరంగా కూడా ఇబ్బంది కలుగుతుంది.

అదేవిధంగా వర్క్ పరంగా చూసుకున్నట్లయితే కూడా ఎంతో ఇబ్బంది కలుగుతుంది. ఈ కారణం వల్లనే మనుషులు ముఖం చూపించరు. మరో కారణం కూడా ఉంది అదేంటంటే ఎక్కువగా జంతువులు మనుషులు పక్కన నిలబడినప్పుడు అవి బాడీని మాత్రమే చూస్తాయి. ముఖం వాటికి కనపడదు. చాలా తక్కువగా ముఖాన్ని చూస్తాయి. కానీ తర్వాత వచ్చిన టామ్ ఎండ్ జెర్రీలలో మనుషులు ముఖాన్ని చూపించడం మొదలుపెట్టారు. ఎక్కువగా ఆడియన్స్ డౌట్ అడగడం లేదు అంటే బడ్జెట్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ మార్పులు చేసి ఉండొచ్చు.


End of Article

You may also like