వాట్సాప్ వాడేటప్పుడు 7 తప్పులు చేస్తున్నారా.? అయితే మీరు రిస్క్ లో పడినట్టే.!

వాట్సాప్ వాడేటప్పుడు 7 తప్పులు చేస్తున్నారా.? అయితే మీరు రిస్క్ లో పడినట్టే.!

by Megha Varna

Ads

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్ ద్వారా మనం ఈజీగా సందేశాలను పంపొచ్చు. అయితే వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను కూడా తీసుకు వస్తోంది. సేఫ్టీ ఇన్ ఇండియా అనే పేరుతో రిసోర్స్ హబ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్.

Video Advertisement

అయితే ఈ యాప్ ను ఏ ఇబ్బంది లేకుండా వినియోగించాలని ప్రతి నెలా నకిలీ ఖాతాలను తొలగించడంతో పాటు వేర్వేరు కారణాలతో ఖాతాలపై నిషేధం కూడా విధిస్తూ ఉంటుంది. అయితే మరి వాట్సాప్ లో ఎలాంటి తప్పులు చేస్తే రిస్క్ లో పడతాం అనేది చూద్దాం.

#1. వాట్సాప్ లో మాల్వేర్ ఫైల్స్ ను ఫార్వర్డ్ చేయకూడదు. మామూలుగా మనకు ఎవరో ఒకరు ఏదో ఒకటి ఫైల్ పంపిస్తూ ఉంటారు. మనకి తెలియకుండా దానిని ఫార్వర్డ్ చేస్తాం. మీరు ఫార్వర్డ్ చేసిన ఫైల్స్ లో కనుక మాల్వేర్ వుంటే… మీ అకౌంట్ ద్వారా మాల్వేర్ వ్యాప్తి చేస్తున్నారని ఇతరులు ఫిర్యాదు చేస్తే అప్పుడు నిషేదం విధిస్తారు లేదు అంటే వాట్సాప్ గుర్తించిన సరే నిషేధం విధించవచ్చు.

#2. అలానే మీకు తెలియని వారిని గ్రూప్లో ఆడ్ చేయడం లేదంటే వాట్సాప్ లో తెలియని నెంబర్స్ ని ఫార్వర్డ్ చేయడం తప్పు. ఎందుకంటే ఫేక్ సమాచారాన్ని వ్యాప్తి చేసే గుర్తింపు లేని నెంబర్లను ప్రమోట్ చేస్తున్నారని ఖాతాని నిషేదించచ్చు.

#3.వాట్సాప్ లో అధిక సంఖ్యలో మెసేజ్లు పంపడం, ఒకేసారి మెసేజ్లు పంపించడం, ఆటో మెసేజ్ లేదా ఆటో డైల్  చేయడం తప్పు.

#4. నకిలీ సమాచారం వ్యాప్తి కోసం చాలా మంది నకిలీ ఖాతాలను వాడతారు. అటువంటి ఖాతాలను కూడా వాట్సాప్ తొలగిస్తుంది. ఎక్కువగా బిజినెస్ అకౌంట్ ద్వారా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.

#5.అలానే వాట్సాప్ లో ఉండే ఫీచర్లను కాకుండా ఎక్స్ట్రా ఫీచర్స్ కోసం కొంత మంది యూజర్లు మోడిఫైడ్ వెర్షన్ వాట్సాప్ ని వాడుతున్నారు. అయితే ఇలా వాడుతూ ఖాతాలు తెరవడం, మెసేజ్ చేయడం, గ్రూప్ క్రియేట్ చేయడంని వాట్సాప్ నిషేధించింది. కాబట్టి ఇది కూడా చేయకూడదు.

#6. అలాగే కొంత మందికి మీరు సంభాషణ చేయడం ఇష్టం లేకపోతే వాళ్ళు ఆపమని అంటారు. అలాంటి సందర్భంలో మీరు మెసేజ్ పంపుతుంటే వాళ్లు ఫిర్యాదు చేయొచ్చు. అప్పుడు కూడా వాట్సాప్ మీ ఖాతాను నిషేధించే అవకాశం ఉంటుంది.

#7. బ్రాడ్ కాస్ట్ ఫీచర్ ద్వారా తరచుగా మెసేజ్లు పంపుతున్నట్లు వాట్సాప్ గుర్తిస్తే కూడా వాట్సాప్ నిషేధం విధించవచ్చు.


End of Article

You may also like