సత్య నాదెళ్ల కొడుకు మరణానికి కారణమైన సెరిబ్రల్ పాల్సీ అంటే ఏంటో తెలుసా.? లక్షణాలు, నివారణ వివరాలు.!

సత్య నాదెళ్ల కొడుకు మరణానికి కారణమైన సెరిబ్రల్ పాల్సీ అంటే ఏంటో తెలుసా.? లక్షణాలు, నివారణ వివరాలు.!

by Megha Varna

Ads

సెరిబ్రల్ పాల్సీ తో మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల కుమారుడు మరణించారు. ఆయన వయసు 26 సంవత్సరాలు. ఈ పిల్లవాడు చూడడానికి మామూలుగా అనిపించినా మూడు నెలలకి తల నిలకడగా లేదు.

Video Advertisement

అయితే తొమ్మిది నెలలు బాబుకి వచ్చిన తర్వాత సెరిబ్రల్ పాల్సీ అని తెలిసింది. అయితే అసలు సెరిబ్రల్ పాల్సీ అంటే ఏమిటి..?, దీని లక్షణాలు ఎలా ఉంటాయి ఎలా తగ్గించవచ్చు వంటివి చూద్దాం.

సెరిబ్రల్ పాల్సీ అంటే ఏమిటి..?

ప్రసవ సమయంలో బిడ్డ మెదడుకు ఆక్సిజన్ కానీ బ్లడ్ లేదా గ్లూకోజ్ సప్లై అవ్వకపోతే మెదడు దెబ్బ తింటుంది. అప్పుడు సెరిబ్రల్ పాల్సీ రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా తల్లి గర్భంలో ఉమ్మనీటిలో మూత్రవిసర్జన చేసి దానిని తీసుకోవడం వల్ల కొందరికి ఆక్సిజన్ అందదు. దీని వల్ల కూడా సెరిబ్రల్ పాలసీ వస్తుంది. నెలలు నిండకుండా పిల్లలు పుట్టినా సరే ఈ ఇబ్బంది వస్తుంది.


కొంత మంది పిల్లలు పుట్టగానే ఏడవరు. దానిని పుట్టుకతో వచ్చిన ఆస్పిక్సియా అంటారు.ఇదిలా ఉంటే కొందరికి పుట్టుకతోనే మెదడుపై ప్రభావం చూపించొచ్చు.బిడ్డ జన్మించాక పచ్చకామెర్లకు సరైన సమయంలో చికిత్స లేకపోయినా కూడా ఈ ఇబ్బంది వస్తుంది.
జెనిటిక్ పరంగా కానీ కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల కానీ ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.

వెయ్యిమందిలో ప్రపంచ వ్యాప్తంగా 1 నుండి 4 వరకు సెరిబ్రల్ పాల్సీ కి గురవుతున్నారు. అయితే ఇక్కడ ఈ బిడ్డ పరిస్థితులు చూసినట్లయితే సత్య నాదెళ్ల భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు 36 వారాల సమయంలో పిల్లవాడి కదలికలు సరిగ్గా లేవు. అప్పుడు వెంటనే ఆపరేషన్ చేసేసారు. అయితే ఆ బిడ్డ ఏడవలేదు గర్భసంచిలో ఆస్పిక్సియా గురించి వాళ్ళకి అప్పుడే తెలిసింది.

సెరిబ్రల్ పాల్సీ లక్షణాలు:

సెరిబ్రల్ పాల్సీ ఉన్న పిల్లలు మాట, చూపు, మేధస్సు సాధారణంగా ఉండవు. ఈ సమస్యతో బాధపడే పిల్లలు ఆకలి నిద్ర అలాంటివి చెప్పలేరు.
ఎదుగుదల కూడా మందకొడిగా ఉంటుంది. సెరిబ్రల్ పాల్సీ లో నరాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. అయితే ఇవి జ్ఞాపక శక్తి పైన ఎఫెక్ట్ చేస్తాయి. ఇలాంటి పిల్లలు ఎంత వయసు వచ్చినా వాళ్ళ పనులు సొంతంగా చేసుకోలేరు. అలానే వారి యొక్క ఫీలింగ్స్ ని చెప్పలేరు.
అయితే వాళ్లు గొంతుతో చేసే శబ్దాల ద్వారా వాళ్ళు ఎలా వున్నారో మనం తెలుసుకోవచ్చు.


వాళ్లు చప్పట్లు కొట్టే తీరుని బట్టి మానసిక పరిస్థితిని తెలుసుకోవాలి. ఆకలి, దాహం వంటివి వారి ప్రవర్తన ద్వారా కనిపెట్టాలి.
ఈ పిల్లలకి ఎంత వయసు వచ్చినా తల్లిదండ్రులే చూసుకోవాలి.

ఈ సమస్యకు నివారణ ఉందా..?

నెలలు నిండకుండా ప్రసవం జరుగుతుంది అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు 48 గంటలు ముందుగా మెగ్నీషియం సల్ఫేట్ ఇంజక్షన్ ఇస్తారు. ఇలా చేయడం వలన సమస్యలు రాకుండా ఉంటాయి.కొంతమందికి కొన్ని రకాల శస్త్రచికిత్సలను చేస్తారు.ఫిజియోథెరపీ కూడా అవసరమవుతుంది. ఫిజియో థెరపీ, వాటర్ థెరపీ ఇలాంటివి ఇస్తారు.

అయితే తన కొడుకు ఇలా ఉండడంతో సత్య నాదెళ్ల వినూత్నమైన పరికరాలను ఆవిష్కరించారు. అంగ వైకల్యం ఉన్నవారు కూడా ఉపయోగించుకునేలా మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల్లో మార్పులు తీసుకొచ్చారు.


End of Article

You may also like