Ads
మన భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. హిందువులు నిత్యం దేవాలయాలను దర్శిస్తూ ఉంటారు. నిజానికి దేవాలయానికి వెళ్తే మనసెంతో ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఉండే బాధలు అన్నీ కూడా తొలగి పోయినట్లు అనిపిస్తుంది. ఎంతో రిలీఫ్ గా ఉంటుంది.
Video Advertisement
ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు ఈ విషయాన్ని గమనించారా..? ఆలయాలకి వెళ్ళినప్పుడు ఆలయాలలో పూజలు చూసే పూజారులు పురుషులు మాత్రమే ఉంటారు. స్త్రీలు ఉండరు.
మరి గుడి లో పూజారులుగా మగవారు మాత్రమే ఎందుకు వుంటారు..? దీని వెనుక కారణం ఏమిటి అనేది ఈరోజు తెలుసుకుందాం. చాలా మందికి ఈ సందేహం ఉంటుంది. కానీ పైకి చెప్పలేరు. ఎందుకు ఆలయాలలో పూజారులుగా మగవారు మాత్రమే ఉంటారు..? స్త్రీలు ఎందుకు ఉండకూడదు అనే విషయంలోకి వెళ్తే..
స్త్రీలలో ప్రకృతి సహజంగా దూరంగా ఉండాల్సిన రోజులు కొన్ని ఉంటాయి. అయితే అవి ఎప్పుడు వస్తాయి అనేది చెప్పలేము. దీని కారణంగా స్త్రీలని ఆలయంలో పూజారులుగా నియమించరు. ఆరోజుల్లో కనుక స్త్రీలు పూజలు చేస్తే దైవ దోషం అవుతుంది. పైగా ఆ తర్వాత మళ్లీ ఎన్నో శుద్ధ ప్రక్రియలు చేయాల్సి ఉంటుంది. నిత్యం దేవాలయంలో పూజలు చేసే పూజారులు దీప, ధూప, నైవేద్యాలను తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.
అందుకే ఆలయాలలో పూజారులుగా మగవారు మాత్రమే ఉంటారు. దేవాలయాన్ని శుభ్రపరచడం కోసం కూడా పురుషుల్ని నియమిస్తారు. ఆలయ ఈవోలుగా మాత్రమే ఆడవారు ఉంటారు. అందుకే ఆడవాళ్ళని ఆలయాలలో పూజారులుగా నియమించరు కేవలం మగవారిని మాత్రమే ఆలయాలలో పూజారులుగా నియమిస్తారు. ఆడవారు ఉంటే ఈ ఇబ్బందులు ఉంటాయి కనుక ఎప్పటి నుంచో మగవారిని మాత్రమే ఆలయాల్లో పూజలు చేయడానికి నియమిస్తున్నారు.
End of Article