కురులు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఇంటి చిట్కాలను అనుసరిస్తే సరి…!

కురులు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఇంటి చిట్కాలను అనుసరిస్తే సరి…!

by Megha Varna

Ads

మహిళలు ఆరోగ్యంతో పాటు అందం పై కూడా శ్రద్ధ పెడుతూ ఉంటారు. ముఖ్యంగా జుట్టు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటారు. జుట్టు సమస్యలు తొలగిపోవాలంటే ఈ చిట్కాలు బాగా ఉపయోగపడుతాయి. మరి అందమైన కురులు మీ సొంతం చేసుకోవాలంటే ఎలాంటి చిట్కాలను ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

జుట్టుకి మెంతులు బాగా పనిచేస్తాయి. మెంతులు వల్ల జుట్టు కి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. జుట్టు స్మూత్ గా కూడా ఉంటుంది. సమయం ఉన్నప్పుడు మెంతుల్ని పొడి చేసుకుని పెట్టుకుంటే జుట్టుకు ఈజీగా ఉపయోగించవచ్చు.

పెరుగుతో పాటు మెంతుల్ని రుబ్బి తలకు పట్టిస్తే జుట్టు ఎంతో ఒక స్మూత్గా ఉంటుంది. పైగా సిల్కీగా కూడా ఉంటుంది. మీరు ఈ మిశ్రమాన్ని రాగి పాత్రలో వేసి రాసుకుంటే కాపర్ కూడా అందుతుంది. ఇలా చేయడం వలన జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

రాగి పాత్రలో పెరుగు వేసి దానిని తలకు ఉపయోగించడం వల్ల చక్కటి ప్రయోజనం పొందవచ్చు. అయితే జలుబు చేసే శరీర తత్వం ఉన్నవాళ్ళు పెరుగుని తలకు పెట్టుకోవడం మంచిది కాదు. వేడి శరీరం వాళ్ళకి ఇది ప్లస్ అవుతుంది. పైగా మెంతిపిండి పెట్టుకున్న జుట్టు చాలా అందంగా కనబడుతుంది. కురులు నిజానికి డబల్ అయినట్లు కనపడతాయి.

నిజానికి జుట్టుకి మెంతులు మించిన అద్భుతమైన పదార్థం మరొకటి లేదు. కావాలంటే మెంతి ఆకులును కూడా మీరు ఉపయోగించవచ్చు.ఒకవేళ కనుక ఈ మిశ్రమం జారిపోకుండా ఉండాలన్నా బాగా తలకు పట్టాలన్న రెండు మందార ఆకుల్ని వేసుకుంటే మంచిది. మందార ఆకులు వల్ల జుట్టు కి ఎంత మేలు కలుగుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పూర్వ కాలం నుంచి కూడా జుట్టుకు వాడుతూనే ఉన్నాము.

అలానే నిమ్మరసాన్ని మీరు డైట్ లో చేర్చుకోవడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యానికి బాగుంటుంది. శరీరానికి చక్కటి పోషణ అందుతుంది. డైట్ లో ఆకుకూరలు తీసుకుంటే కూడా జుట్టు ఆరోగ్యానికి బాగుంటుంది. ముఖ్యంగా తోటకూర వంటివి డైట్ లో తీసుకుంటే మీ జుట్టు బాగుంటుంది. నిజానికి బయట చేసిన వాటికంటే కూడా తీసుకునే ఆహారం వలన జుట్టు సంరక్షణకు బాగా ఉపయోగపడతాయి.


End of Article

You may also like