ఎన్నో సమస్యలని…. ఈ ఒక్క గ్లాస్ జ్యూస్ తో తగ్గించుకోవచ్చు మీకు తెలుసా..?

ఎన్నో సమస్యలని…. ఈ ఒక్క గ్లాస్ జ్యూస్ తో తగ్గించుకోవచ్చు మీకు తెలుసా..?

by Megha Varna

Ads

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యం పై శ్రద్ద ఎక్కువైంది. అయితే మన ఆరోగ్యం బాగా ఉండాలంటే మంచి ఆహార పదార్థాలను తీసుకోవాలి. చాలా మంది అధిక బరువు సమస్యతో బాధ పడుతున్నారు.

Video Advertisement

కేవలం పెద్దలే కాదు చిన్న పిల్లలు కూడా బాగా లావుగా అయిపోతున్నారు. బరువు కూడా విపరీతంగా పెరిగిపోతున్నారు. దీనికి గల కారణం ఆహారపు అలవాట్లు.

అయితే బరువు తగ్గాలని వ్యాయామం చేయడం, డైటింగ్ చేయడం లాంటి ఎన్నో పద్ధతులు ఫాలో అవుతూ ఉంటారు. కానీ నిజానికి బరువు తగ్గాలనుకుంటే ఈ చిట్కాని ప్రయత్నం చేయండి. దీనితో తప్పకుండా బరువు తగ్గుతారు. మీ రోజువారి ఆహారంలో సొరకాయ చేర్చుకుంటే తప్పకుండా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

సొరకాయని మీకు నచ్చినట్టు తీసుకొచ్చు. కూర రూపంలో కానీ జ్యూస్ రూపంలో గాని సూప్ ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. ఎలా తీసుకున్న సరే బరువు తగ్గిపోతారు. సొరకాయ లో విటమిన్ బి, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అలానే నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. సొరకాయ తీసుకోవడం వల్ల జీవక్రియ రేటును పెంచుతుంది.

జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఇందులో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. సొరకాయ రసం తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు రోజంతా కూడా యాక్టివ్ గా ఉండొచ్చు. ఇక జ్యూస్ ఎలా చెయ్యాలి అనేది చూస్తే.. సొరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకుని రసం తీసుకోవాలి. తర్వాత ఆ రసాన్ని వడకట్టుకోవాలి. కొంచెం నల్ల ఉప్పు, నిమ్మరసం వేసుకుంటే రుచి బాగుంటుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.


End of Article

You may also like