నేతాజీ వద్ద గూఢచారిగా పని చేసిన ఈ మహిళ ఎవరో తెలుసా..? రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో..?

నేతాజీ వద్ద గూఢచారిగా పని చేసిన ఈ మహిళ ఎవరో తెలుసా..? రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో..?

by Anudeep

Ads

బ్రిటిష్ వారు భారతీయులను రెండొందల సంవత్సరాల పాటు పాలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారి దోపిడీని ఎదుర్కొని.. వారిని ఈ దేశం నుంచి తరిమికొట్టడానికి ఎందరో స్వతంత్ర యోధులు పోరాటం చేసారు. వారి పోరాటాల ఫలితమే నేటి స్వతంత్ర భారతదేశం.

Video Advertisement

అయితే.. చాలా మంది స్వతంత్ర సమర యోధుల గురించి నేటి భారతీయులకు తెలియదు. అలా మరుగున పడిన వారిలో ఈ మహిళ కూడా ఒకరు. ఈమె గాంధీజీని, నేతాజీని అభిమానించి.. నేతాజీ మార్గదర్శకత్వంలోనే నడిచారు.

  • ఆమె సంపన్న వర్గ కుటుంబంలో జన్మించారు. ఆమె స్నేహితులంతా సంపన్నులే. అయితే.. వారంతా కెరీర్ లో స్థిరపడడమో.. లేక పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడమో చేస్తుంటే తాను మాత్రం దేశం కోసం పోరాడాలని అనుకుంది. తన 16 సంవత్సరాల వయసులోనే గూఢచారిణిగా మారింది. ఆమె ఎవరో కాదు.. ఆమె పేరు సరస్వతి రాజమణి. ఆమె అసలు పేరు రాజమణి. ఆమె ఉత్సాహాన్ని, తెలివి తేటలను చూసిన నేతాజీ ఆమెకు సరస్వతి అన్న పేరుని కూడా కలిపి సరస్వతి రాజమణి ని చేసారు.

బ్రిటిష్ పాలన కాలంలోనే బర్మా ప్రజలకు స్ఫూర్తిని ఇవ్వడం కోసం గాంధీజీ ఓ సారి బర్మాకి వచ్చారు. ఈ క్రమంలో తమిళనాడు నుంచి బర్మాకు వెళ్లి స్థిరపడ్డ కొన్ని సంపన్న కుటుంబాలు గాంధీజీని కలిసాయి. వారిలో రాజమణి కుటుంబం కూడా ఉంది. అప్పటికి రాజమణి వయసు పది సంవత్సరాలు మాత్రమే. ఆమె పిస్తోలుతో ఆడుకోవడం చూసిన గాంధీజీ పిస్టల్ తో ఆడుతున్నావు.. షూటర్ వి అవుతావా..? అని ప్రశ్నించారు. లేదు.. నేను ఆంగ్లేయులను షూట్ చేస్తా అని బదులిచ్చింది రాజమణి. మనం అహింసా మార్గంలోనే ముందుకెళ్తున్నామని.. ఇలా చేయవద్దని గాంధీజీ చెప్పడంతో.. మనల్ని లూటీ చేసేవాళ్ళని షూట్ చేయాలి.. వారు మనలని లూటీ చేస్తున్నారు కాబట్టి కచ్చితంగా షూట్ చేస్తా అని ఆ వయసులోనే స్థిరంగా చెప్పేసింది.

ఆ తరువాతి క్రమంలో.. ఆమె యుక్తవయసుకి వచ్చేసరికి రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆ పరిస్థితుల్లో ఆంగ్లేయులను తరిమికొట్టాలంటే ఆయుధమే సరైన మార్గమని బోధించిన నేతాజీ మాటలు ఆమెను ఆకర్షించాయి. ఆజాద్ హిందూ ఫౌండేషన్ కోసం వాలంటీర్లను భర్తీ చేసుకునే క్రమంలో నేతాజీ ఓ సారి బర్మా వచ్చారు. ఆ టైములో రాజమణి తన బంగారు నగలన్నిటిని తీసుకొచ్చి ఇచ్చేసారు. అయితే.. ఆమెను చిన్నపిల్లగా భావించిన నేతాజీ వాటిని తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎంతచెప్పినా రాజమణి మంకుపట్టు వీడకపోవడంతో.. ఆయన ఆమె ఇంటికి వెళ్లారు. ఆమె తల్లితండ్రుల సమక్షంలో మాట్లాడారు. అప్పటికీ రాజమణి తన మంకు పట్టు వీడలేదు.

ఆమె పట్టుదల చూసి మెచ్చిన నేతాజీ ఆమెను ఆజాద్ హిందూ ఫౌజ్ లో చేర్చుకుంటానని మాటిచ్చారు. రంగూన్ లోని ఓ ఆసుపత్రిలో ఆమెకు నర్స్ గా అవకాశం కల్పించారు. ఆమె కేవలం నర్స్ గానే పరిమితం కాలేదు. దీనితో ఆమె ఆసక్తిని గమనించిన నేతాజీ ఆమెని ఝాన్సీ రాణి రెజిమెంట్ లో చేర్పించి సైనిక శిక్షణను అందించారు. అక్కడ దుర్గ అనే స్నేహితురాలితో కలిసి ఆమె గూఢచర్యం పనులు చేసేది. వారు జుట్టు కత్తిరిచ్చుకుని మా పిల్లలలాగ తయారయ్యి బ్రిటిష్ మిలిటరీ శిబిరాల్లో పనివారిగా చేరారు. అక్కడి సైనికాధికారుల బట్టలు ఉతకడం, బూట్లు శుభ్రం చేయడం, ఇంటి పనులు చేయడం వీరి బాధ్యతగా ఉండేది. కీలక సమాచారాలని గమనించి సహచరులకు అందిస్తూ బోస్ కు చేరవేసేవారు. ఈ క్రమంలో ఓ సారి దుర్గ పట్టుపడిపోయింది. ఈ క్రమంలో అక్కడనుంచి రాజమణిని తప్పించడం కోసం నాట్యకత్తెలా తయారయ్యి అక్కడి జైలర్లను మరిపించింది. సమయం చూసి వారికి మత్తుమందు కలిపిన ద్రవం తగ్గించింది. అయితే.. మరోవైపు రాజమణి అక్కడనుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడే కాల్పులు జరపడంతో రాజమణి కాలిలో తూటా దిగింది.

దీనితో వారిద్దరూ ఎలాగోలా తప్పించుకుని చెట్లు ఎక్కి దాక్కున్నారు. రక్తం కిందకి కారకుండా ఆకులు కట్టుకుని రెండు మూడు రోజుల పాటు తిండి నిద్ర లేకుండా అలానే ఉన్నారు. సమయం చూసి అక్కడినుంచి తప్పించుకుని ఆజాద్ హిందూ ఫౌజ్ కు చేరారు. వీరి సాహసాన్ని నేతాజీ కీర్తించారు. వీరికి లెఫ్టినెంట్ పదోన్నతిని ఇవ్వడంతో పాటు సరస్వతి రాజమణికి తొలి భారతీయ మహిళా గూఢచారి అన్న సర్టిఫికెట్ ను కూడా ఇచ్చారు. స్వతంత్రం వచ్చాక వీరి కుటుంబం తమిళనాడుకు తిరిగి వచ్చేసింది. కానీ, 1971 వరకు ఆమెకు స్వతంత్ర సమరయోధుల పెన్షన్ అందలేదు. దీనితో ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2005 వరకు ఓ చిన్న అపార్ట్మెంట్ లో ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఆమెను ఆర్ధికంగా ఆదుకున్నారు. 90 ఏళ్ల వయసులో రాజమణి 2018 జనవరిలో ఈ లోకాన్ని వీడారు.


End of Article

You may also like