ఈ కొత్త సంవత్సరం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే..?

ఈ కొత్త సంవత్సరం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే..?

by Megha Varna

Ads

ఫ్లవ నామ సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు శ్రీ శుభకృత్ నామ సంవత్సరం వచ్చేస్తోంది. అయితే ఈ కొత్త సంవత్సరం ఏ రాశి వాళ్లకు ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. మరి మీ రాశి కూడా ఎలా ఉందో ఇప్పుడే చెక్ చేసుకోండి.

Video Advertisement

#1. మేష రాశి:

మేష రాశికి అధిపతి కుజుడు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ కూడా వీళ్లు సవాళ్లను ఎదుర్కోవడానికి రెడీగా ఉంటారు. కానీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందుల్లో పడతారు. ఈ ఏడాది భూగర్భ రంగాల్లో స్థిరపడే వాళ్ళకి మంచి అవకాశాలు లభిస్తాయి. అలానే జాతక చక్రం లో శని, కుజులు అనుకూలిస్తే పోలీసు, మిలటరీ, ఆటోమొబైల్ రంగం వారు స్థిరపడతారు.

#2. వృషభ రాశి:

ఈ రాశి వాళ్ళ ఓర్పు కనుక కోల్పోయారు అంటే వీళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఈ రాశి వారు ఎక్కువగా అలంకరణ పై శ్రద్ధ పెడతారు. గురు, బుధులు అనుకూలంగా ఉంటే ఈ రాశి వాళ్ళు ఏ పనైనా పూర్తి చేయగలరు. వస్త్ర, రసాయన, ప్లాస్టిక్, పాల వ్యాపారం చేసే వాళ్ళకి ఈ ఏడాది కలిసి వస్తుంది.

#3. మిధున రాశి:

వీళ్ళకి సాంకేతిక నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది. నలుగురి మధ్య ప్రత్యేకత చాటుకుంటారు. ఈ ఏడాది కామర్స్, అడ్మినిస్ట్రేటివ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ రంగాల వాళ్ళకి బాగుంటుంది.

#4. కర్కాటక రాశి:

ఈ రాశి వాళ్ళు చిన్న చిన్న పనులను కూడా మళ్లీ మళ్లీ ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఈ ఏడాది వీరికి ఉద్యోగంలో ఇబ్బందులు ఉండవు. ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేటివ్, బ్యాంకింగ్ రంగాల వారికి ఈ ఏడాది బాగుంటుంది.

#5. సింహరాశి:

సింహ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. అలానే ఇతరులను వీళ్ళు ఎక్కువగా నమ్మేస్తారు కూడా. ఈ రాశి వాళ్ళకి ఈ ఏడాది గ్రహాలు బలంగా ఉంటే ఉన్నత స్థితికి వెళ్తారు. రాజకీయ, మీడియా, మేనేజ్మెంట్, వైద్య రంగాల వారికి ఈ ఏడాది బాగుంటుంది.

#6. కన్య రాశి:

ఈ రాశి వాళ్ళకి ఒత్తిడి వుంటే సహనాన్ని కోల్పోతూ ఉంటారు. కామర్స్, బ్యాంకింగ్, విదేశీ వ్యవహారాలు వంటి రంగాల్లో రాణిస్తారు. వ్యవసాయం, పండ్ల తోటలు, పశుపోషణ వారికి బాగా లాభాలు వస్తాయి.

#7. తులారాశి:

సినిమా, ఫోటోగ్రఫీ, మీడియా రంగాల్లో వీరు బాగా రాణిస్తారు. అలంకరణ వస్తువులు, మద్యం. వినోద సాధనాలు, వ్యాపారాల వాళ్ళకి లాభదాయకంగా ఈ ఏడాది ఉంటుంది.

#8. వృశ్చిక రాశి:

బయటికి వీళ్ళు చాలా ధైర్యంగా కనబడతారు. కానీ వీళ్ళు చాలా పిరికివారు. వైద్య, న్యాయవాద విద్యలో రాణిస్తారు. ఈ ఏడాది మిలటరీ, పోలీస్, గూఢచర్య రంగాలవారికి అనుకూలం ఈ ఏడాది ఉంటుంది.

#9. ధనస్సు రాశి:

ధనస్సు రాశి వాళ్ళు సహృదయులుగా పేరు తెచ్చుకుంటారు. సివిల్, మెకానిక్, గనులకు సంబంధించిన విద్యలో రాణిస్తారు. న్యాయవిద్య, ఇంజినీరింగ్‌, కామర్స్‌ విద్యలో రాణిస్తారు. బ్యాంకింగ్‌, మేనేజ్‌మెంట్‌ రంగాలు అనుకూలం.

#10. మకర రాశి:

సహనంతో ఎంతటి లక్ష్యాలనైనా సాధిస్తారు. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. ఈ ఏడాది విద్యాబోధన, గృహనిర్మాణం, గనులు, రాజకీయ రంగాల్లో ఈ రాశి వాళ్ళకి బాగుంటుంది.

#11. కుంభరాశి:

ఈ రాశి వాళ్ళు విషాద దృక్పథం కలిగి ఉంటారు. ఆత్మసాక్షి మేరకు నడుచుకుంటారు. సివిల్, ఇంజనీరింగ్ విభాగంలో అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. లోహాలు కి చెందిన వ్యాపారులకు ఈ ఏడాది అనుకూలంగా ఉంది.

#12. మీన రాశి:

రచనా వ్యాసంగంపై ఈ రాశి వాళ్ళకి అభిరుచి ఎక్కువగా ఉంటుంది. రసాయన నిపుణలు, వైద్యం, ఉపాధ్యాయ రంగాలలో బాగా రాణిస్తారు. విద్యారంగం, హైడల్ పవర్. బ్యాంకింగ్ లో పెట్టుబడులుకి ఈ ఏడాది అనుకూలంగా ఉంటుంది.


End of Article

You may also like